బరువు తగ్గాలనుకునే వారు పోషకాలతో కూడిన ఆహారం తినడం, వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. అయితే, బరువు తగ్గేందుకు నిద్ర కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది.
Photo: Pexels
వెయిట్ లాస్ కావాలనుకునే వారు సరిపడా నిద్రించడం కూడా చాలా ముఖ్యం. ప్రతీ రోజూ కనీసం 7 గంటల పాటు నిద్రిస్తే బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. వెయిట్ లాస్‍కు, బరువు తగ్గేందుకు సంబంధం ఏంటో ఇక్కడ చూడండి.
Photo: Pexels
తగినంత నిద్రించడం వల్ల శరీరంలో గెర్లిన్, లెప్టిన్ లాంటి హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. ఆకలి అదుపులో ఉంటూ సంతృప్తి ఉండేలా ఇవి తోడ్పడతాయి. సరిగా నిద్రపోకపోతే గెర్లిన్ పెరిగిపోయి అతిగా ఆకలి అవుతుంది. ఎక్కువగా తినడం వల్ల బరువు అదుపులో ఉండదు.
Photo: Pexels
నిద్ర సరిగా ఉంటే శరీరంలో జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. క్యాలరీలు బర్న్ అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. సరైన నిద్ర లేకపోతే బరువు పెరిగే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
Photo: Pexels
తగినంత నిద్ర లేకపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే బరువు తగ్గే ప్రయత్నానికి ఇబ్బందులు కలుగుతాయి.
Photo: Pexels
నిద్ర సరిగా లేకపోతే వ్యాయామాలు చురుగ్గా చేయలేరు. అలసటగా అనిపిస్తుంది. వ్యాయామాలు యాక్టివ్‍గా చేయకపోతే క్యాలరీలు సరిగా కరిగించలేరు.
Photo: Pexels
సరిగా నిద్రపోకపోతే జీర్ణక్రియకు కూడా ఇబ్బందే. తరచూ మెలకువ వస్తే స్నాక్స్ తినాలని కూడా మనసు లాగేస్తుంది. అర్ధరాత్రిళ్లు ఆహారం తింటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.