లైంగిక జీవితంపై నిద్ర ప్రభావం చూపుతుందా..! ఈ విషయాలపై ఓ లుక్కేయండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 31, 2025

Hindustan Times
Telugu

చాలా విషయాలు మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతాయి. ఇందులో ఒత్తిడి,హార్మోన్ల అసమతుల్యత, నిద్ర లేకపోవడంతో పాటు మరికొన్ని అంశాలు ఉంటాయి.

image credit to unsplash

లైంగిక జీవితంపై నిద్ర ప్రభావం తప్పకుండా ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యలు ఉంటే లైంగిక జీవితంలో ఒడిదొడుకులు తప్పవని అంటున్నారు.

image credit to unsplash

నిద్ర సరిగా లేకపోతే  టెస్టోస్టెరాన్ స్థాయిలపై ప్రభావం ఉంటుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే టెస్టోస్టెరాన్  మొత్తాన్ని తగ్గిస్తుంది.

image credit to unsplash

నిద్రలేమి సమస్య ఉన్న మహిళల్లో సెక్స్ చేసే సమయంలో నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర ఉంటే.. ఇలాంటి సమస్యను అధిగమించవచ్చని సూచిస్తున్నారు.

image credit to unsplash

నిద్ర లేకపోవడం వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్య తలెత్తుతుందని  కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

image credit to unsplash

నిద్రలేమి సమస్య ఉంటే తొందరగా అలసటకు గురవుతారు. ఫలితంగా సెక్స్ పట్ల ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది.

image credit to unsplash

మంచి లైంగిక జీవితానికి సరిపడే నిద్ర అవసరం. అంతేకాకుండా  పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని నిత్యం తాజాగా, శక్తివంతంగా ఉంచుతుంది.

image credit to unsplash

జుట్టు తెల్లబడటాన్ని, బట్టతల రావడాన్ని కరివేపాకు సమర్ధవంతంగా నిరోధిస్తుంది. జుట్టు సంరక్షణకు ఇది అత్యుత్తమ వంటింటి ఔషధం.