భారత్‌లోని ఎస్-400 మిస్సైల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?

Image Source From unsplash

By Basani Shiva Kumar
May 09, 2025

Hindustan Times
Telugu

ఎస్-400 వ్యవస్థలో శక్తివంతమైన రాడార్‌లు ఉంటాయి. ఇవి శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్‌లను చాలా దూరం నుంచే గుర్తిస్తాయి. 

Image Source From unsplash

ఇవి ఒకసారి లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత.. రాడార్ దాని కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తుంది.

Image Source From unsplash

ఈ వ్యవస్థ ఏ రకమైన ముప్పు వస్తుందో విశ్లేషిస్తుంది. దానిని ఎదుర్కోవడానికి సరైన క్షిపణిని ఎంచుకుంటుంది.

Image Source From unsplash

కమాండ్ సెంటర్ నుంచి ఎస్-400 కు ఆదేశం వచ్చిన వెంటనే.. లక్ష్యాన్ని ఛేదించడానికి క్షిపణిని ప్రయోగిస్తుంది.

Image Source From unsplash

ఇది ప్రయోగించిన క్షిపణి.. రాడార్ ద్వారా లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. కొన్ని క్షిపణులలో సొంత రాడార్‌లు కూడా ఉంటాయి. ఇవి లక్ష్యాన్ని మరింత కచ్చితంగా చేరుకుంటాయి.

Image Source From unsplash

ఎస్-400 నుంచి వెళ్లిన క్షిపణి లక్ష్యాన్ని నేరుగా ఢీకొంటుంది. కొన్ని సందర్భాల్లో సమీపంలో పేలిపోయి లక్ష్యాన్ని నాశనం చేస్తుంది.

Image Source From unsplash

ఎస్-400 వ్యవస్థ ద్వారా ఒకేసారి అనేక లక్ష్యాలను ట్రాక్ చేయవచ్చు. ఎక్కువ సంఖ్యలో ట్రాక్ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది.

Image Source From unsplash

ఎస్-400 వ్యవస్థలో వివిధ రకాల క్షిపణులు ఉంటాయి. స్వల్ప, మధ్య, సుదూర శ్రేణులు ఉంటాయి. తద్వారా వివిధ రకాల ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

Image Source From unsplash

విటమిన్ లోపాలను గుర్తించండి 

ఈ సమస్యలు విటమిన్ లోపాల వల్లనే వస్తాయని మీకు తెలుసా?

PEXELS, RUSH