ఇంట్లోనే తయారుచేసుకునే పనీర్ స్నాక్స్. స్పెషల్ ఐటెంలు ట్రై చేసేయండి మరి! 

By Ramya Sri Marka
Feb 04, 2025

Hindustan Times
Telugu

స్నాక్స్ ఐటెంలలో వెజ్ స్నాక్స్ చాలా స్పెషల్.. పనీర్ తో ఇలా ట్రై చేసి చూడండి.

Photo Credits: Flickr

పనీర్ అంటే ఇష్టపడని వారుండరు. వీలైనన్ని వంటల్లో పనీర్ వాడి కొత్త రుచుల కోసం ప్రయత్నిస్తుంటారు. 

Photo Credits: HT File Photo

వెజ్ ఐటెంలలో స్పెషల్ వంటకంగా పేరొందని పనీర్‌తో ఎన్నో రకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా..

Pexel

పనీర్ పకోడాలు తయారు చేయవచ్చు. వీటిని పుదీనా చట్నీ లేదా టీతో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది. 

Photo Credits: Flickr

పనీర్ బేసన్ చిల్లా ఒక ఉప్పగా ఉండే పాన్‌కేక్ లాంటిది. తురిమిన పనీర్, ఇతర కూరగాయలను కలిపి తయారు చేస్తారు. సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చు.

Photo Credits: Flickr

చాయ్ టైమ్‌కు పర్ఫెక్ట్ స్నాక్ పనీర్ కచోరి. మైదా కచోరి లోపల పనీర్, మసాలాలను నింపి వేయించి తయారు చేస్తారు.

Photo Credits: HT File Photo

పనీర్ టిక్కా ట్రై చేయండి. దహీ మెరీనేడ్‌లో పనీర్, శిమ్లా మిర్చి, ఉల్లిపాయలను మెరీనేట్ చేసి, గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు గ్రిల్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి.

Pexel

మసాలాలు, మిర్చితో పనీర్, ఆలూ మిశ్రమాన్ని ఉపయోగించి ఇంట్లో పనీర్ టిక్కా తయారు చేయండి. దీనికి మిర్చి చట్నీ కలుపుకుని తింటే బాగుంటుంది.

pexel

ఒక్క లైన్​తో జీవిత పాఠాలు నేర్పించిన తెలుగు సినిమా డైలాగ్​లు ఇవి..