నోటి పుండ్లు విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. ఏమీ తినలేని విధంగా మండుతుంది. మాత్రలు వేసుకునే బదులు, ఇంటి నివారణలను ఉపయోగించొచ్చు.

Unsplash

By Anand Sai
Jun 27, 2024

Hindustan Times
Telugu

తీసుకునే ఆహారంలో మార్పు, జీవనశైలిలో తేడా, శరీరంలో వేడి కారణంగా నోరు, పెదవుల లోపల పొక్కులు వస్తాయి. ఇది విపరీతమైన నొప్పి, బాధను కలిగిస్తుంది.

Unsplash

నోటిపూతలకు పేరి ఆకు దివ్యౌషధం. ఈ ఆకులను నీళ్లలో మరిగించి కషాయంగా లేదా ఆకులను తింటే ఒక్కరోజులో నోటిపూత పోతుంది.

Unsplash

నోటి పుండు నివారణకు నెయ్యి, ఉప్పు కలిపి తీసుకుంటే మంచిది. ఉప్పు, నెయ్యి వేసి పుండు మీద రాస్తే నొప్పితోపాటు నోటిపూత ఒక్కరోజులో మాయమవుతుంది.

Unsplash

ఉప్పు నీళ్లతో నోటిని బాగా పుక్కిలించడం వల్ల అల్సర్ కూడా తగ్గుతుంది. కానీ కోలుకోవడానికి సమయం పట్టవచ్చు.

Unsplash

నోటి అల్సర్లకు మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ లవంగాలు. రోజూ ఒకట్రెండు లవంగాలు నమిలి ఆ రసాన్ని అల్సర్ల మీద రాయాలి. ఇలా చేయడం వల్ల నోటి అల్సర్ చాలా త్వరగా తగ్గుతుంది.

Unsplash

నోటిపూత, అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ మంచినీళ్లు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Unsplash

నోటి అల్సర్లను తగ్గించడానికి ఇంటి నివారణలు ఉత్తమ మార్గం. ఒక్కసారి ట్రై చేసి చూడండి.

Unsplash

ఖాళీ పొట్టతో ఒక వెల్లుల్లి రెబ్బ తింటే ఏమవుతుంది?

pixabay