హైబీపీ లేదా రక్తపోటును తగ్గించే ఇంటి చిట్కాలు

ఇంట్లోనే రక్తపోటును నియంత్రించడానికి 6 చిట్కాలు

PEXELS

By Hari Prasad S
May 14, 2025

Hindustan Times
Telugu

అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ నిశ్శబ్దంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తుంది. దీనికి మందులు తప్పనిసరి అయినా జీవనశైలి మార్పులు, ఇంటి చిట్కాలతో దానిని సమర్థవంతంగా నియంత్రించేందుకు సాయం చేస్తాయి

PEXELS, HEALTHLINE

రక్తపోటును నియంత్రించడానికి ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి

PEXELS

ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి

చురుకుగా ఉండటం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ప్రతి రోజూ వాకింగ్, వ్యాయామం వంటివి డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

PEXELS

ఉప్పు వాడకం తగ్గించండి

ఉప్పు వాడకం తగ్గించడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రోజుకు 1,500-2,300 మి.గ్రాములకు పరిమితం చేయండి. 

PEXELS

ఆల్కహాల్ తగ్గించండి

రాత్రి భోజనంతో రెడ్ వైన్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందన్నది అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మితిమీరిన మద్యపానం ఆరోగ్య సమస్యలను కారణమవుతుంది. రక్తపోటు మందులకు ఆటంకం కలిగిస్తుంది.

కెఫిన్ వాడకం తగ్గించండి

కెఫిన్ తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుంది. దానిని మితిమీరకుండా చూసుకోండి. నిజానికి కాఫీ, టీ మితంగా తాగేవారికి గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. 

PEXELS

కోకో లేదా డార్క్ చాక్లెట్ తినండి

డార్క్ చాక్లెట్, కోకో పౌడర్లో రక్త నాళాలను సడలించడానికి సహాయపడే మొక్కల సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.

PEXELS

బరువు తగ్గడానికి ప్రయత్నించండి.

బరువు తగ్గడం వల్ల అధిక రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది. మీరు వ్యాయామం చేసేటప్పుడు ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

PEXELS

మొబైల్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి