టాక్సిక్‌కు హాలీవుడ్ టచ్.. తొలిసారిగా ఇలా.. యశ్‌పై ఫైట్ మాస్టర్ పొగడ్తలు!

By Sanjiv Kumar
Mar 13, 2025

Hindustan Times
Telugu

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ జేజే పెర్రీ తొలిసారి ఓ కన్నడ సినిమాకు ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. 

Image Credit: hollywoodreporter

'రాకీ భాయ్ టాక్సిక్' యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించిన జేజే పెర్రీ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.

హాలీవుడ్ సూపర్ స్టార్ స్టంట్ మాస్టర్‌గా జేజే పెర్రీకి పేరుంది. 

టాక్సిక్ చిత్రం కోసం జెజె పెర్రీ భారతదేశానికి వచ్చారు. ప్రస్తుతం టాక్సిక్ షూటింగ్ పూర్తి చేసుకుని హాలీవుడ్‌కు తిరిగి వెళ్లిపోయారు. 

అయితే, యశ్‌పై పొగడ్తలు కురిపిస్తూ జేజే పెర్రి నోట్ రాసుకొచ్చారు. "మై ఫ్రెండ్ నీతో వర్క్ చేయడం బాగుంది. రా పవర్" అంటూ పెర్రీ రాసుకొచ్చారు. 

పెర్రీ ముంబైలో 'టాక్సిక్' యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేశారు.  యశ్ ప్రస్తుతం బెంగళూరులో 'టాక్సిక్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

టాక్సిక్ చిత్రానికి గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 

వచ్చే ఏడాది 'టాక్సిక్'ను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ 6 చిట్కాలతో ఏ వయసులోనైనా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుకోండి!

Photo Credit: Pinterest