భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ ఇన్ఫెక్షన్ ఎలా సోకుతుంది, చికిత్స మార్గాలు, వ్యాక్సిన్ అందుబాటులో ఉందా? తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Jan 07, 2025
Hindustan Times Telugu
హెచ్ఎంపీవీ అనేది శ్వాసకోశ వైరస్. ఇది చైనాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి.
pexels
హెచ్ఎంపీవీ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే వైరస్. సాధారణ జలుబు లేదా ఫ్లూ లక్షణాలను కలిగి ఉంటుంది. 2001లో మొదటిసారి ఈ వైరస్ ను గుర్తించారు. ఇది న్యుమోనియా వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది.
pexels
హెచ్ఎంపీవీ న్యుమోవిరిడే కుటుంబానికి చెందిన హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు..తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది.
pexels
హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వ్యక్తి తాకిన వస్తువులను తాకి...ముఖం, కళ్లు లేదా నోటిని తాకడం ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకకుండా మాస్క్ లు ధరించడం, చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
pexels
హెచ్ఎంపీవీ లక్షణాలు- ఇది ఇతర శ్వాసకోశ వైరస్ ల మాదిరిగానే ఉంటుంది. ఈ వైరస్ ద్వారా దగ్గు, జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఉంటుంది. వ్యాధి తీవ్రమైతే ముఖ్యంగా పిల్లలు, పెద్దలలో.. బ్రోన్కియోలిటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తుంది.
pexels
చిన్న పిల్లలు, ముఖ్యంగా శిశువులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వారికి హెచ్ఎంపీవీ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పెద్దవారిలో ఈ వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది.
pexels
హెచ్ఎంపీవీ వ్యాక్సిన్ ఉందా?
pexels
ప్రస్తుతం హెచ్ఎంపీవీకి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. విశ్రాంతి తీసుకోవడం, హైడ్రేటెడ్ గా ఉండటం, ఓవర్-ది-కౌంటర్ మందుల ద్వారా ఈ వ్యాధికి చిక్సిత అందిస్తున్నారు. వ్యాధి లక్షణాలు తీవ్రమైన సందర్భంలో...ఆసుపత్రిలో చేరడం, ఆక్సిజన్ థెరపీ అవసరం కావొచ్చు.
pexels
జంటగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ టిప్స్ పాటించండి