హెచ్​ఎంపీవీ ప్రమాదకరమా? కొత్త వైరస్​ లక్షణాలేంటి? పూర్తి వివరాలు..

pixabay

By Sharath Chitturi
Jan 06, 2025

Hindustan Times
Telugu

చైనాలో హెచ్​ఎంపీవీ కలకలం సృష్టిస్తోంది. ఇండియాలో కూడా ఈ వైరస్​ అనుమానిత కేసు (బెంగళూరులో) నమోదైంది. అసలేంటి ఈ హెచ్​ఎంపీవీ?

pexels

హెచ్​ఎంపీవీ అంటే హ్యూమన్​ మెటాన్యుమోవైరస్​. చైనాలో ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి.

pexels

హెచ్​ఎంపీవీ.. ఒక శ్వాసకోస సంబంధిత ఇన్​ఫెక్షన్​ అని నిపుణులు చెబుతున్నారు.

pexels

5ఏళ్లలోపు చిన్నారులు, రోగనిరోధక శక్తి సరిగ్గా లేని వృద్ధుల్లో ఈ హెచ్​ఎంపీవీ ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

pexels

దగ్గు, జ్వరం, ముక్కు కారటం లేదా ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి వంటివి ఈ వైరస్​కి సంబంధించిన కొన్ని లక్షణాలు. కొంత మందిలో శ్వాస ఆడటం ఇబ్బందిగా ఉంటుంది.

pexels

చాలా మందిలో ఈ లక్షణాలు కనిపించిన 2-5 రోజుల్లోపు అవి తగ్గిపోతాయి. కొందరికి మాత్రం ఇబ్బందులు ఏర్పడతాయి.

pexels

వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధం ద్వారా, దగ్గు లేదా తుమ్ముల నుంచి శ్వాస బిందువుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.

pexels

జుట్టును మెరుగ్గా ఉంచే కాపర్ అధికంగా ఉండే ఫుడ్స్ ఇవి