ప్రయాణం అంటేనే కొందరికి కడుపులో దేవినట్టు అవుతుంది. కొద్దిపాటి దూరం కారు, బస్సులో  ప్రయాణం చేసినా వాంతులు అయిపోతాయి. 

By Bolleddu Sarath Chandra
Dec 27, 2024

Hindustan Times
Telugu

ప్రయాణం ప్రారంభించి కాసేపటికే చాలామందికి కడుపులో వికారం మొదలవుతుంది.

కారు,బస్సు, లారీ ఇలా వేగంగా కదిలే వాహనాల్లో ప్రయాణాల వల్ల కలిగే కుదుపులు కొందరిలో అసౌకర్యం కలిగిస్తాయి. 

ఈ సమస్య కొందరిలో పడవ ప్రయాణాల్లో కూడా తలెత్తుతుంది. 

వికారం, వాంతులు కావడం, ఆకలి మందగించడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి

ప్రయాణ సమయంలో కళ్లు తిరిగినట్టు అనిపించడం, ముఖం పాలిపోలవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

కొందరిలో తీవ్రమైన కడుపునొప్పి, పేగులు కదులుపోయిన భావన కూడా కలుగుతుంది. 

వాంతులు విపరీతంగా అయితే శరీరంలో ఉన్న నీరంతా బయటకు పోవచ్చు.

వాంతులు అవుతున్నా ద్రవ పదార్ధాలు తీసుకుంటూ ఉండాలి. వాంతులు అవుతున్నా ద్రవపదార్ధాలు పోకుండా తీసుకుంటూ ఉండాలి. 

కడుపులో వికారంగా ఉంటే శుభ్రమైన  గాలిని పీలుస్తూ ఉండాలి. కొందరిలో కార్లు, బస్సుల్లో ఉండే ఏసీల వల్ల కూడా తల తిరగడం, వికారపు భావన కలుగుతుంది. 

ప్రయాణ సమయంలో  పక్క నుంచి వెళ్లే వస్తువులు, వాహనాలను చూస్తే కళ్లు మరింత ఎక్కువగా తిరిగే అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్న వస్తువులను మాత్రమే చూస్తుండాలి.

సమస్య తీవ్రంగా ఉంటే కళ్లు గట్టిగా మూసుకోవడం, అవకాశం ఉంటే  పడుకునే స్థితిలో ఉండటం ద్వారా వికారపు భావన తగ్గించుకోవచ్చు. 

ప్రయాణ సమయానికి అరగంట, గంట ముందు వాంతుల కోసం వాడే  మందుల్లో ఏదో ఒకటి మింగాలి. ప్రయాణ సమయాల్లో  పొగతాగే వారి పక్కన ఉండకూడదు. 

కారులో ప్రయాణ సమయంలో గంట,గంటకు ఆగి ప్రయాణిస్తే వాంతులు రావు. ప్రయాణానికి ముందు భోజనం చేయకూడదు. ప్రయాణ సమయంలో కూడా తినకూడదు.  ప్రయాణ సమయంలో చదవడం, కిటికీల నుంచి చూడకూడదు. 

అరకు టూర్ ప్యాకేజీ -  తక్కువ ధరలోనే వన్ డే ట్రిప్

image credit to unsplash