ఫ్రెంచ్ ఆమ్లెట్ రెసిపీ ఇదిగో, అదిరిపోతుంది

Pinterest

By Haritha Chappa
Mar 14, 2025

Hindustan Times
Telugu

ఇంట్లో సులభంగా తయారుచేసుకునే సంప్రదాయ ఫ్రెంచ్ ఆమ్లెట్ రెసిపీ ఇక్కడ ఉంది.

Pinterest

గుడ్లు - 3, క్యాప్సికమ్ - 2, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయలు - 1, క్యారెట్లు - 1,  బీన్స్ - ఒకటి, కారం - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, బటర్ - తగినంత.

Pinterest

ముందుగా గుడ్లను ఒక గిన్నెలో కొట్టాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా గిలక్కొట్టాలి. 

Pinterest

క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు, క్యాప్సికం, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి గుడ్ల మిశ్రమంలో వేసి కలపాలి. దానిలో కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి.

Pinterest

స్టవ్ మీద పెనం పెట్టి బటర్ వేయాలి. మంట చిన్నగా పెట్టుకోవాలి. 

Pinterest

ఇప్పుడు పెనం మీద గుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకుని వేయించాలి. 

Pinterest

పెనం మీద మూత పెట్టడం మర్చిపోవద్దు. ఆమ్లెట్ ను రెండో వైపు తిప్పకుండా చిన్న మంట మీద అలాగే వేయించాలి. 

Pinterest

అంతే టేస్టీ ఫ్రెంచ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Pinterest

వేపాకును రోజు నమిలితే శరీరంలో కనిపించే మార్పులు ఏంటే మీకు తెలుసా? 

pexels