ఈ రాశులు వారు రెబెల్స్, వీరికి రూల్స్ పెడితే నచ్చదు

Canva

By Haritha Chappa
Apr 18, 2025

Hindustan Times
Telugu

రాశుల ఆధారంగా మనం చాలా విషయాలు చెప్పవచ్చు. ఒక వ్యక్తి  స్వభావం,  ప్రవర్తన కూడా అంచనా వేయవచ్చు.  రాశుల ఆధారంగా ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

Canva

కొన్ని రాశుల వారు రెబెల్స్ లా వ్యవహరిస్తారు. వారికి రూల్స్ పెడితే నచ్చవు. నియమాలు పాటించేందుకు ఇష్టపడరు. రూల్స్ బ్రేక్ చేసేందుకే ఇష్టపడతారు. 

Canva

మేష రాశి వారికి భయం ఉండదు. మేష రాశి వారు ఎవరి అనుమతి తీసుకోరు. రూల్స్ బ్రేక్ చేయడంలో ముందుంటారు. అనుకున్నది సాధిస్తారు. 

Canva

మిథున రాశి వారు చాలా తెలివైనవారు. ఈ రాశి వారు నియమాలను ఉల్లంఘించడానికి ఇష్టపడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించరు. తాము కోరుకున్నది పొందాలనుకుంటే వారు రూల్స్ పట్టించుకోరు. 

Canva

సింహ రాశి వారు పుట్టుకతోనే గొప్ప నాయకులు. వారు తమ సొంత మార్గాన్ని అనుసరిస్తారు. అందరూ అదే బాటలో నడవాలని కోరుకుంటున్నారు. ఈ రాశుల వారు నియమాలను రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉంటారు.

Canva

వృశ్చిక రాశి వారు కూడా నిబంధనలు పాటించరు. వారు చేయాల్సిన పని చేస్తూనే ఉంటారు. అందుకోసం నిబంధనలు మార్చుకుంటారు. వీరికి రూల్స్ నచ్చవు.

Canva

ధనుస్సు రాశి వారు సాహస ప్రేమికులు. ఈ రాశిలో పుట్టిన వారు నియమాలను ఉల్లంఘిస్తారు. నిబంధనలు పాటించాలన్న ఆలోచన వీరికి చాలా తక్కువగా వస్తుంది.

Canva

కుంభ రాశి వారు ఫన్ కోసం కూడా నియమాలు ఉల్లంఘిస్తారు. తమకు తోచిన పనే చేస్తూ ఉంటారు.  నిబంధనలు పట్టించుకోరు. 

Canva

మీన రాశి వారు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తారు. వారు కోరుకున్నది పొందాలనే ఆశతో నియమాల గురించి వారు పట్టించుకోరు.

Canva

నిరాకరణ: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు మరియు వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.

Canva

చెవులలో దురద చాలా సాధారణం. అయితే కొందరిలో ఇది తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు చేసే పనుల కారణంగా చెవి దురద సమస్య తీవ్రతరం అవుతుంది. చెవి దురదకు కారణాలు, ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.   

pexels