ఎండలో చల్లదనాన్ని ఇచ్చే  పండ్లు ఇవిగో

By Haritha Chappa
May 22, 2025

Hindustan Times
Telugu

పండ్లు ఆరోగ్యకరమైనవే కానీ కొన్ని మాత్రం శరీరానికి వేడి చేస్తాయి. కొన్ని పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఎండ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి తోడ్పడతాయి. అలాంటి చలువ చేసే పండ్ల గురించి తెలుసుకోండి.

పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వేసవిలో శరీరంలోని నీటి కొరతను తీర్చడానికి ఇది ఉత్తమ పండు.

పుచ్చకాయ మాదిరిగానే కీరదోసకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.

నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. ఆరెంజ్ పొటాషియం లోపాన్ని తొలగిస్తుంది.

UNSPLASH

మామిడి జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది అద్భుతమైన సమ్మర్ డ్రింక్, శరీరానికి మాంగనీస్, కాల్షియం, సెలీనియం, ఐరన్ వంటి పోషకాలను అందిస్తుంది

UNSPLASH

కివిఫ్రూట్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.  అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది గొప్ప ఎంపిక

కివి పండులో సెరోటోనిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది మూడ్ స్వింగ్స్,  సమతుల్య నిద్రకు సహాయపడుతుంది

చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి అరటిపండ్లు సహాయపడతాయి

వివిధ రకాల బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, నీరు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels