మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు

By Sudarshan V
Jun 14, 2025

Hindustan Times
Telugu

లెమన్ గ్రాస్ ఒక సూపర్ హెర్బ్. యాంటీఆక్సిడెంట్స్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఉదయమే టీ గా తీసుకోండి.

Image Credits: Adobe Stock

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

Image Credits: Adobe Stock

లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల గట్ లో మంచి బ్యాక్టీరియా పరిమాణం పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. ఈ ఫ్యాట్ బర్నింగ్ టీ ని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

Image Credits: Adobe Stock

ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ ను నివారిస్తుంది.

Image Credits: Adobe Stock

ప్రతిరోజూ ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే, ప్రేగు కదలిక సాఫీగా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. 

Image Credits: Adobe Stock

సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

Image Credits: Adobe Stock

యాంటీఆక్సిడెంట్స్,  యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్న లెమన్ గ్రాస్ టీ శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తుంది.  సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Image Credits: Adobe Stock

కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

Image Credits: Adobe Stock

లెమన్ గ్రాస్ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కీళ్లలో వాపు, నొప్పి తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

Image Credits: Adobe Stock

లెమన్ గ్రాస్ టీ మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది

Image Credits: Adobe Stock

ఉదయాన్నే లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. ఇది టెన్షన్లను తగ్గించి, మెదడును రిలాక్స్ చేస్తుంది. ఇది తలనొప్పి సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే నిద్రలేమిని దూరం చేస్తుంది.

Image Credits: Adobe Stock

లెమన్ గ్రాస్ టీ ఎలా తయారు చేయాలి?

Image Credits: Adobe Stock

ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని వేడి చేయండి. ఇప్పుడు లెమన్ గ్రాస్ ఆకులు వేసి కాసేపు మరగనివ్వాలి. టీ రెడీ అయ్యాక వడకట్టాలి. రుచి కోసం కొంత తేనెను యాడ్ చేసుకోవచ్చు. దీన్ని రోజూ రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.

Image Credits: Adobe Stock

గాయిటర్‌  వ్యాధి లక్షణాలు తెలుసా..? 

image credit to unsplash