వేసవిలో శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇవిగో చిట్కాలు 

image credit to unsplash

By Haritha Chappa
Mar 19, 2025

Hindustan Times
Telugu

వేసవిలో చాలా మంది చెమట, దుర్వాసన సమస్యలతో బాధపడుతుంటారు. ఈ వాసనను వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సింపుల్ పద్దతుల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

image credit to unsplash

ఈ వేసవిలో వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. అప్పుడే మలినాలన్నీ బయటకు వెళ్లి శరీరం తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది. 

image credit to unsplash

ముఖ్యంగా వేసవిలో తగినంత నీరు తాగకపోతే శరీర ఉష్ణోగ్రతలో మార్పులు సంభవిస్తాయి. ఇది ప్రధానంగా చెడు వాసనకు దారితీస్తుంది.

image credit to unsplash

వేసవిలో కారం, మసాలా దట్టించిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. మాంసాహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

image credit to unsplash

చేపలు, వెల్లుల్లి, ఉల్లి, ఆల్కహాల్ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేదంటే శరీరం నుంచి దుర్వాసన వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా జ్యూస్ తాగితే చాలా మంచిది.

image credit to unsplash

ముఖ్యంగా ఈ వేసవిలో లోదుస్తులను క్రమం తప్పకుండా మార్చుకుంటూ ఉండాలి. పరిశుభ్రమైనవి వాడకపోతే దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. 

image credit to unsplash

వేసవిలో రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. డియోడరెంట్ వాడే వారు నాణ్యమైన వాటిని ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే చర్మ సమస్యలు వస్తాయి.

image credit to unsplash

ఈ వేసవిలో సాక్సులు వేసుకోకపోవడమే మంచిది. వీటిని ధరించాల్సి వస్తే ప్రతిరోజూ మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాక జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. 

image credit to unsplash

గర్భిణులు బీన్స్ గింజలు తినవచ్చా.. ఉపయోగాలు ఏంటి? 8 అంశాలు

Image Source From unsplash