'టోఫు '... పోషకాలు అందించడంలోనూ తోపు - ఆరోగ్య ప్రయోజనాలివే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Aug 21, 2024
Hindustan Times Telugu
మాంసాహారం లాంటి రుచి, మంచి ప్రోటీన్లు శాఖాహారంలో లభించాలంటే టోఫు చాలా బెటర్. చూడటానికి అచ్ఛంగా పనీర్ ను పోలి ఉంటుంది.
image credit to unsplash
టోఫు తినడం ద్వారా రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. కాబట్టి టోఫు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి.
image credit to unsplash
టోఫులో మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. అంతేకాకుండా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కూడా అందిస్తుంది.
image credit to unsplash
టోఫులో జింక్ ఉంటుంది, ఇది రోగనిరోధక పనితీరుకు అవసరం. గాయాలు నయం కావటానికి, రక్తం గడ్డకట్టడంలోనూ సహాయపడుతుంది.
image credit to unsplash
టోఫు మంటను తగ్గిస్తుంది, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. UV రేడియేషన్ నుండి మన చర్మాన్ని కాపాడుతుంది.
image credit to unsplash
టోఫులోని పోషకాలు క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి. టోఫు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్, కడుపు క్యాన్సర్ , జీర్ణ క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు పేర్కొన్నాయి.
image credit to unsplash
మిల్లెట్స్ తింటే ఏమవుతుంది...? వీటిని తెలుసుకోండి