పొట్టను క్లీన్ చేసే అయిదు మార్నింగ్ డ్రింక్స్ ఇవిగో
pixabay
By Haritha Chappa Mar 20, 2025
Hindustan Times Telugu
ఆరోగ్యకరమైన ఉదయం పానీయాలతో మీ రోజును ప్రారంభించండి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. పొట్ట పూర్తిగా క్లీన్ అవుతుంది. శరీరంలో చేరిన మలినాలు తొలగిపోతాయి.
Pixabay
మిమ్మల్ని ఉత్సాహపరిచే కొన్ని ఆరోగ్యకరమైన ఉదయం పానీయాలు ఇక్కడ ఉన్నాయి.
Pixabay
రెండు వారాల పాటు రోజూ మాచా టీ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. చక్కెర కలపకుండా తాగిగేమంచిది.
Pexels
నిమ్మకాయ నీటిలో డిటాక్సిఫికేషన్ గుణాలు ఎక్కువ. ఈ శక్తివంతమైన పానీయంతో జీర్ణక్రియ ఆరోగ్యం, ఆర్ద్రీకరణ కూడా దక్కుతుంది. నిమ్మకాయ నీటిలో తెల్ల చక్కెర కలుపుకోవడం మంచిది కాదు. తేనె కలుపుకోవడం మంచిది.
Pixabay
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పోషకాలు అధికంగా ఉండే స్మూతీలు ప్రతిరోజూ ఉదయం తినాలి. పాలకూర, అరటి పండు, చియా విత్తనాలు, బాదం పాలు వంటి వాటితో స్మూతీలు తయారు చేసుకుని తింటే మంచిది.
Pixabay
బీట్రూట్ డ్రింక్ ఉదయానే తాగితే ఎంతో మంచిది. విటమిన్ సి, ఇనుమును ఇది పెంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయ పనితీరు, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Pexels
కలబంద జెల్ ను ఉదయం పూట జ్యూస్ లో మిక్స్ చేసుకుని తాగితే మంచిది. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొత్తం ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది.
Pixabay
డిస్క్లైమర్: ఇవి సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడతాయి. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దాని వాస్తవికతకు ఏ విధంగానూ బాధ్యత వహించదు. ఈ రంగంలోని నిపుణులను సంప్రదించడం ముఖ్యం.
Pexels
గర్భిణులు బీన్స్ గింజలు తినవచ్చా.. ఉపయోగాలు ఏంటి? 8 అంశాలు