ఈ వేసవిలో వడదెబ్బను నివారించడానికి 10 చిట్కాలు

Image Credits : Adobe Stock

By Hari Prasad S
Mar 28, 2025

Hindustan Times
Telugu

మీ శరీరం వేడెక్కినప్పుడు, తనను తాను చల్లబరచుకోలేనప్పుడు వడదెబ్బ సంభవిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వడదెబ్బకు గురయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనిని నివారించడానికి ఈ 10 చిట్కాలను అనుసరించండి. 

Image Credits : Adobe Stock

హీట్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు, దానిని నివారించడానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. రోజంతా నీరు ఎక్కువగా తాగాలి. మీరు నిమ్మ, పుదీనా లేదా దోసకాయ వంటి పండ్లతో చేసిన నీటిని కూడా ప్రయత్నించవచ్చు.

హైడ్రేటెడ్ గా ఉండండి

Image Credits : Adobe Stock

సోడాల వంటి కార్బోనేటేడ్ పానీయాలు మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీరు, హెర్బల్ టీలు లేదా సహజ జ్యూస్‌లనే తాగండి.

కార్బోనేటేడ్ పానీయాలకు దూరంగా ఉండండి

Image Credits : Adobe Stock

వేసవిలో ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో ఇవి  జీర్ణం కావడం కష్టం. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. సలాడ్లు, పండ్లు, తృణధాన్యాలు వంటి తేలికపాటి, పోషకాలున్న ఆహారం తినండి

తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారం

Image Credits : Adobe Stock

దోసకాయ, పుచ్చకాయ, పెరుగు వంటి ఆహారాలు మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడే సహజ కూలెంట్లు. ఈ ఆహారాలలో అధిక నీటి కంటెంట్, అవసరమైన పోషకాలు ఉంటాయి.

కూలింగ్ ఫుడ్స్ తీసుకోండి

Image Credits : Adobe Stock

తీవ్రమైన వేడిలో వ్యాయామం చేయడం వల్ల మీ శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతుంది. ఉదయం లేదా సాయంత్రం వేడి తక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి.

తీవ్రమైన వ్యాయామాలు వద్దు

Image Credits : Adobe Stock

వేసవి కాలంలో ఎక్కువగా వచ్చే చెమటను పీల్చుకొని శరీరాన్ని హాయిగా ఉంచేందుకు వదులుగా ఉండే, కాటన్ దుస్తులను మాత్రమే వేసుకోండి

వదులుగా ఉండే, కాటన్ దుస్తులు ధరించండి

Image Credits : Adobe Stock

చల్లటి నీటితో స్నానం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. చల్లటి టవల్ తో శరీరంపై మర్దనా చేసుకున్నా కూడా ఉపశమనంగా ఉంటుంది.

చల్లటి నీటితో స్నానం

Image Credits : Adobe Stock

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండండి. బయటకు వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోండి

ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఉండండి

Image Credits : Adobe Stock

మీరు ఏసీలో ఉన్నట్లయితే సడెన్‌గా ఎండలోకి వెళ్లొద్దు. క్రమంగా శరీరంపై పడే వేడిని పెంచుకుంటూ పోవాలి. అంటే మొదట సాధారణ గది ఉష్ణోగ్రతలోకి వచ్చి తర్వాత బయటకు వెళ్లాలి

ఒకేసారి ఏసీ నుంచి ఎండలోకి వెళ్లొద్దు

Image Credits : Adobe Stock

టోపీ, సన్ గ్లాసెస్ ధరించడం లేదా గొడుగు తీసుకెళ్లడం ద్వారా మీ తల. కళ్ళను సూర్యుడి నుండి రక్షించండి. ఇవి హానికారక యూవీ కిరణాలను నుంచి కాపాడతాయి.

ఎండ నుంచి రక్షించుకోండి

Image Credits : Adobe Stock

సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి