మీరు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఈ 10 సూపర్ ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకోండి. ఇవి మీ జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును బర్న్ ను చేయడంలో సహాయపడతాయి.
pexels
By Bandaru Satyaprasad Feb 03, 2025
Hindustan Times Telugu
ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ - చికెన్, చేపలు, గుడ్లు, బీన్స్ వంటి ఆహారాలు ప్రోటీన్ తో నిండి ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అతిగా తినడాన్ని తగ్గించుకోవచ్చు. బరువు తగ్గడంలో సహాపడుతుంది.
pexels
బెల్ పెప్పర్ - బెల్ పెప్పర్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులోని విటమిన్ సి బెల్లీ ఫ్యాట్ తో ముడిపడి ఉన్న కార్టిసాల్ హార్మో్న్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
pexels
నిమ్మకాయ - లెమన్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సితో నిండి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని, శరీర శక్తి స్తాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. నిమ్మకాయ నీటిని క్రమం తప్పకుండా తాగితే జీవక్రియను పెంచుతుంది.
pexels
అవకాడో - ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ తో నిండిన అవకాడోలు మీ పొట్ట నిండుగా, సంతృప్తిగా ఉండేలా చేస్తాయి. వీటిల్లో బరువు తగ్గడానికి తోడ్పడే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అవసరమైన పోషకాలు ఉంటాయి.
pexels
కివి - కివి పండ్లలో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. కివి జీర్ణక్రియకు సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. తక్కువ కేలరీల సూపర్ ఫుడ్ మీ పొట్టను నిండుగా ఉంచేందుకు సహాయపడుతుంది.
pexels
బెర్రీస్ - బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ తో నిండి ఉంటాయి. వీటిలోని తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
pexels
అల్లం - అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. కేలరీల బర్న్ ను పెంచుతుంది. అధిక బరువు ఉన్న వారికి ఇది గొప్పగా పనిచేస్తుంది.
pexels
దాల్చిన చెక్క - ఈ మసాలా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొవ్వు నిల్వకు దారితీసే ఆకస్మిక స్పైక్ లను నివారిస్తుంది. అదనపు రుచికోసం మీ ఓట్ మీల్ లేదా స్మూతీస్ లో యాడ్ చేసుకోండి.
pexels
చిల్లీ పెప్పర్- చిల్లీ పెప్పర్ లో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది మీ జీవక్రియను పెంచుకుంది. ఆకలిని తగ్గిస్తుంది. మిత ఆహారంతో కొవ్వు వేగంగా కరగడానికి సహాపడుతుంది.
pexels
ఓట్ మీల్ - ఓట్స్ ఫైబర్ కు గొప్ప మూలం. ఇది ఆహార సంతృప్తిని అందిస్తుంది. అల్పాహారంగా ఓట్ మీల్ తినడం వల్ల రోజంతా ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు.
pexels
రాత్రిపూట మటన్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!