ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

Unsplash

By Anand Sai
Jul 06, 2025

Hindustan Times
Telugu

గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి మంచి ఆహారం తినడంతో పాటు అనారోగ్యకరమైన ఆహారానికి కూడా దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం.

Unsplash

ఆరోగ్యంగా ఉండాలంటే మొదట గుండె బాగుండాలి. అది విఫలమైతే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. ఈ ఐదు ఆహారాలు గుండెకు మంచివి కావు.

Unsplash

కుకీలు, కేకులు, మఫిన్లు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. కానీ వాటిలో చక్కెర చాలా ఉంటుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాల జోలికి కూడా పోకూడదు.

Unsplash

మనం సోడా, కూల్‌డ్రింక్స్ లాంటి పానీయాలు తాగుతాం. ఈ పానీయాలలో చక్కెర ఉంటుంది. గుండె సమస్యలకు దారితీయవచ్చు.

Unsplash

రెడ్ మీట్ అతిగా తినడం వల్ల గుండె సమస్యలు, మధుమేహం వస్తాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలతో పాటు గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

Unsplash

ఆహారంలో ఉప్పు, చక్కెర ఎక్కువగా తీసుకోవద్దు. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి హానికరం, గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రమాదాలకు దారితీస్తాయి.

Unsplash

అలాగే పాస్తా, కొన్ని రకాల స్నాక్స్ మన ఆరోగ్యానికి మంచివి కావు. వీటితో గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ పెరుగుతాయి.

Unsplash

అరటిపండుతో కన్నా ఎక్కువ పొటాషియం లభించే ఆహారాలు ఇవి..

pexels