ప్రతిరోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు యాలకుల పాలను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
Unsplash
By Anand Sai Jul 31, 2024
Hindustan Times Telugu
ఏలకుల్లో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ బి6, ప్రొటీన్, ఫైబర్, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
Unsplash
పాలలో యాలకుల పొడిని కలుపుకొని ప్రతిరోజూ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
Unsplash
యాలకుల పాలు తాగడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నివారించవచ్చు. పాలలో యాలకులు లేదా యాలకుల పొడిని జోడించడం వల్ల ప్రయోజనాలను రెట్టింపు చేస్తుంది.
Unsplash
ఒత్తిడి, సరైన జీవనశైలి లేనివారు రోజూ పాలతో యాలకుల పొడిని తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Unsplash
ఏలకుల పాలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ క్రమబద్ధం అవుతుంది. ఏలకులలోని పీచు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
Unsplash
గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఏలకుల పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజూ ఏలకులు తింటే గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడవు.
Unsplash
ఏలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, మాంగనీస్ శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు పంపుతాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.
Unsplash
వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న సుప్రీత.. హాట్ ఫొటోలతో ఫైర్