నైట్‍షిప్ట్‌లు చేస్తున్నారా? ఈ టిప్స్ తప్పక పాటించండి
Photo: Unsplash
By Chatakonda Krishna Prakash Sep 25, 2023
Hindustan Times Telugu
తరచూ రాత్రివేళ్లలో మేలుకొని పని చేయడం (నైట్‍షిప్ట్) ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అయినా కొందరు తప్పక చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Photo: Unsplash
నైట్ షిఫ్ట్స్ చేసే వారు పాటించాల్సిన ముఖ్యమైన టిప్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Unsplash
రాత్రి నిద్రపోకపోయినా.. ఉదయం వేళలో తగినంత నిద్ర తప్పనిసరి. షిఫ్ట్ అయిపోయిన వెంటనే ఉదయం వేళల్లో తగినంత సమయం నిద్రించాలి. దీని వల్ల అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.
Photo: Unsplash
రాత్రివేళల్లో పని చేసేటప్పుడు తరచూ నీరు తాగండి. హైడ్రేటెడ్‍గా ఉండండి. దీని వల్ల మీ శరీరంలోని వేడి నియంత్రణలో ఉంటుంది. మీ ఏకాగ్రత పెరిగేందుకు కూడా ఉపయోగపడుతుంది.
Photo: Unsplash
నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్లు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలి. నట్స్, ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. రాత్రి హెవీగా తినకూడదు. ఇలా చేస్తే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
Photo: Unsplash
నైట్ షిఫ్ట్స్ చేసేటప్పుడు మధ్యమధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. అటూ ఇటూ తిరగాలి. దీని వల్ల మీలో ఒత్తిడి తగ్గుతుంది.
Photo: Unsplash
రాత్రి పని చేసేటప్పుడు ఆకలి వేస్తే ఆరోగ్యకరమైన స్నాక్స్ మాత్రమే తినాలి. నట్స్, పండ్ల ముక్కలు లాంటివి తీసుకోవాలి. అనారోగ్యకరమైన, జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పట్టే ఫుడ్స్ తీసుకోకూడదు.
Photo: Unsplash
నైట్ షిఫ్ట్ చేసే వారు బ్రేక్ ఫాస్ట్ అసలు మిస్ చేయకూడదు. ఉదయం తినాలి. అలాగే, సరైన వర్కౌట్స్ కూడా చేయాలి.