ఆరోగ్యంగా ఉండేందుకు తినాల్సిన విత్తనాలివే!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 29, 2024

Hindustan Times
Telugu

ఫ్లాక్స్ సీడ్స్ : అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, ఫైబర్ మరియు ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. బరువు తగ్గించటంలో సహాయపడుతాయి.

image credit to unsplash

సన్ ఫ్లవర్ సీడ్స్ : విటమిన్ ఇ, మెగ్నీషియం మరియు సెలీనియంతో నిండిన పొద్దుతిరుగుడు విత్తనాలు చాలా పోషకమైనవి. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

image credit to unsplash

గుమ్మడికాయ గింజలు : వీటినే పెపిటాస్ అని కూడా పిలుస్తారు. బరువు తగ్గడం నుండి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.  జింక్, ఐరన్ మరియు పొటాషియంతో నిండిన ఈ గింజలు...  రోగనిరోధక పనితీరును బలపరుస్తాయి.

image credit to unsplash

చియా సీడ్స్ : ఈ విత్తనాల్లో  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్ మరియు కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటాయి. చియా విత్తనాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

image credit to unsplash

జనపనార గింజలు : జనపనార గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఇందులో దాగి ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

image credit to unsplash

దానిమ్మ గింజలు : యాంటీఆక్సిడెంట్లతో సహా అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. 

image credit to unsplash

నువ్వుల గింజలు : జింక్, కాపర్, కాల్షియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కండరాల బలోపేతంతో పాటు హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడే అద్భుతమైన ప్రోటీన్ మూలాలను కలిగి ఉంటాయి.

image credit to unsplash

ఏనుగు తొండంలో ఎన్ని కండరాలు ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

pexels