డయాబెటిస్‍ను కంట్రోల్ చేయగల క్యాలరీలు తక్కువగా ఉండే డ్రింక్స్ ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Nov 03, 2024

Hindustan Times
Telugu

డయాబెటిస్ ఉన్న వారు తీసుకునే ఆహారాలు, డ్రింక్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉంచేవి తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారి కోసం క్యాలరీలు తక్కువగా ఉండే డ్రింక్స్ ఇవే.

Photo: Pexels

కూరగాయల జ్యూస్‍ల్లో  క్యాలరీలు తక్కువగా ఉంటాయి. క్యారెట్, బీట్‍రూట్, కీరదోస సహా మరిన్ని కూరగాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్‍లు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉంటాయి. 

Photo: Pexels

చక్కెర వేయని నిమ్మరసం నీటిలో క్యాలరీలు, గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. డయాబెటిస్‍ను కంట్రోల్ చేసేందుకు ఇది ఉపకరిస్తుంది. 

Photo: Pexels

మజ్జిగలో క్యాలరీలు, గ్లెసెమిక్ ఇండెక్స్ స్వల్పంగా ఉంటాయి. ఇది తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్‍లో ఉండేందుకు సహకరిస్తుంది.

Photo: Pexels

ఉసిరి, కలబంద కలుపుకొని జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఈ డ్రింక్‍లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెళ్లను ఈ జ్యూస్ కంట్రోల్‍లో ఉంచగలదు. 

Photo: Pexels

చియా విత్తనాలు నానబెట్టిన నీటిలోనూ క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్ వల్ల డయాబెటిస్ కంట్రోల్‍లో ఉండేందుకు ఈ డ్రింక్ సహకరిస్తుంది. 

Photo: Pexels

చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ, జీర్ణక్రియ తరచుగా దెబ్బతింటుంది. ఊరగాయల వంటి పచ్చళ్లు చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శీతాకాలంలో పచ్చళ్లు తినడానికి 9 కారణాలు తెలుసుకుందాం.  

pexels