హిమోగ్లోబిన్ పెరగటం ఎలా..? ఆరోగ్యకరమైన 4 డ్రింక్స్ ఇవే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jun 11, 2025
Hindustan Times Telugu
ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రొటీన్. ఇది శరీర అవయవాలు, కణజాలాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. మీకు హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువ ఉంటే రక్తహీనత తలెత్తుతుంది.
image credit to unsplash
హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే అలసత్వంగా, బలహీనంగా కూడా అనిపించవచ్చు. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి కొన్ని రకాల డ్రింక్స్ తీసుకోవచ్చు.
image credit to unsplash
ఉసిరి జ్యూస్ : హీమోగ్లోబిన్ పెరగటానికి విటమిన్ సీ చాలా అవసరం. ఇందులో ఉసిరి జ్యూస్ లో సమవృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజూ తీసుకుంటే... హిమోగ్లోబిన్ పెరగటానికి
image credit to unsplash
బీట్ రూట్ కంజి : హీమోగ్లోబిన్ పెరగటానికి బీట్ రూట్ కంజి తోడ్పడుతుంది. ఈ మిశ్రమం తగినంత మోతాదులో ఐరన్ అందిస్తుంది. ఈ సాంప్రదాయ పానీయం ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది.
image credit to unsplash
చెరకు రసం : చెరుకు రసంలో ఇనుము మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇది కూడా హీమోగ్లోబిన్ పెరగటానికి సహాయపడుతుంది.
image credit to unsplash
దానిమ్మ జ్యూస్ : దానిమ్మ రసం హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే పానీయాలలో ఒకటి. ఇది రుచికరమైనది. పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండులో ఇనుము మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి.
image credit to unsplash
అల్ల నేరేడు, డ్రై ఆప్రికాట్లు, రాగులు, పప్పులు, మునగ ఆకులు, చింతపండు గుజ్జు, వేరుశెనగ, బెల్లం మొదలగు వాటిల్లో కూడా ఐరన్ ఉంటుంది. అవి హీమోగ్లోబిన్ స్థాయిను పెంచుతాయి.