ఆరోగ్యకరమైన సంభాషణ- తమ సమస్యలను చర్చించుకునేటప్పుడు సౌకర్యంగా ఉండటమే ఆరోగ్యకరమైన సంభాషణ.
pexels
By Bandaru Satyaprasad Mar 04, 2024
Hindustan Times Telugu
ఇతరుల మాటలు వినకపోవడం- సంభాషణ అనేది ఆలోచనలు ఎక్సైంజ్ చేసుకోవడం. అందువల్ల అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
pexels
వివిధ కమ్యూనికేషన్(Communication) మార్గాలు - మనం వివిధ వర్గాల ప్రజలను కలుస్తుంటాము, వారు మాట్లాడే విధానం భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు మన భాష రాని వాళ్లను కలుస్తుంటాము. వారి భావవ్యక్తీకరణ బట్టి అర్థం చేస్తుకుంటాము.
pexels
వ్యక్తులపై నమ్మకం- ఎదుటి వ్యక్తితో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వారిని విశ్వసించడం చాలా ముఖ్యం. విశ్వాసం లేకపోవడం వల్ల అవతలి వ్యక్తి సంభాషించేందుకు ఇష్టపడరు. ఇది అనుమానం, అసూయ, ఇతర హానికరమైన ఆలోచనలకు దారితీయవచ్చు.
pexels
ప్రతిస్పందన(Respond)- మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం ముఖ్యం. సంభాషణ పూర్తి కాకుండా మధ్యలోనే ప్రతిస్పందించడం అంత మంచిది కాదు. ఇది అవతలి వ్యక్తి అభిప్రాయం మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు.
pexels
అవతలి వ్యక్తికి అంతరాయం కలిగించడం - ఒక విషయంపై మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తిని తరచూ అంతరాయం కలిగించడం మంచిది కాదు. దీంతో మీపై అవతలి వ్యక్తికి చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి మాట్లాడటం ముగించిన తర్వాత ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు పాజ్(Pause) చేయడం ముఖ్యం.
pexels
మాట్లాడేటప్పుడు పాజ్- మనం చెప్పేదానికి అవతలి వ్యక్తి ప్రతిస్పందించడానికి మనం తరచుగా పాజ్ ఇవ్వాలి. సంభాషణ(Communication) అనేది మనకు అనిపించేదాన్ని చెప్పడం కంటే అవతలి వ్యక్తితో సన్నిహితంగా ఉండటం. మనం చెప్పేది అవతలి వ్యక్తి అర్థం చేసుకోగలిగేలా మాట్లాడటం చాలా ముఖ్యం.
pexels
అధికంగా మాట్లాడడం - మీ సంభాషణలో భాగస్వామితో పోటీ పడడం అంతగా మంచిది కాదు. అవతలి వ్కక్తిని డామినేట్ చేసేలా అతిగా మాట్లాడడం గుడ్ కమ్యునికేషన్ కాదంటున్నారు నిపుణులు.
pexels
తక్షణమే స్పందించడం- సంభాషణలో విని, ఆపై సమాధానం ఇవ్వడం ముఖ్యం. మీరు వినడం మాత్రమే కాకుండా, అవతలి వ్యక్తి చెప్పేది, వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఆపై మీ ప్రతిస్పందన ఉండాలి.
pexels
అబద్ధం చెప్పడం- మనకు తెలియని విషయాల గురించి సలహాలు ఇవ్వడాన్ని మానుకోవాలి. తెలియనిదాన్ని తెలియదని ఒప్పుకోవడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని తగ్గించుకున్నట్లు కాదు. మీ సంభాషణలో నిజాయితీ చాలా అవసరం.