బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడమే మీ లక్ష్యం అయితే, ఈ ఆరు రకాల మసాలా దినుసులు(స్పైసెస్) సహాయపడతాయి. ఇవి జీవక్రియను పెంచి, కొవ్వును కరిగిస్తాయి. ఆకలి తగ్గించి మీరు బరువు తగ్గడానికి తోడ్పడతాయి.
pexels
పసుపు - పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమెటరీ సమ్మేళనం. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
pexels
నల్ల మిరియాలు - ఈ స్పైసీ మసాలాలో పైపెరిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. శరీరంలో వేడిని పెంచి కొవ్వును తగ్గిస్తుంది. దీంతో ఎక్కు కేలరీలు బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది.
pexels
వెల్లుల్లి - వెల్లుల్లిలో లభించే అల్లిసిన్ శరీర బరువు, కొవ్వును తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలన నియంత్రించడంలో సహాయపడుతుంది.
pexels
దాల్చిన చెక్క - దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి దోహదం చేస్తుంది.
pexels
అల్లం - అల్లం జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది. శరీరంలో అధిక కేలరీలను బర్న్ చేయడం సహాయపడుతుంది. ఇది ఆకలిని తగ్గించి బరువు నియంత్రణను సులభం చేస్తుంది.
pexels
జీలకర్ర - జీలకర్ర జీవక్రియ రేటును మెరుగుపరిచి, అదనపు కొవ్వును బర్న్ చేయడానికి సాయపడుతుంది. వీటితో పాటు వ్యాయామం, సమతుల ఆహారం పాటిస్తే జీర్ణక్రియకు మంచిది. ఇది బరువు నిర్వహణకు ముఖ్యం.
pexels
రక్త హీనతతో బాధ పడుతున్నారా?.. ఇవి మీ ఆహారంలో చేర్చండి..