బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడానికి 5 సూపర్ ఫుడ్స్ ఇవే
pexels
By Bandaru Satyaprasad May 11, 2024
Hindustan Times Telugu
డయాబెటిస్ఉన్న వారు ఆరోగ్యకరమైన భోజనం తినాలని వైద్యుల సిఫార్సు. మీ రక్తంలో షుగర్ స్థాయిలను అదుపులో ఉంచేందుకు సాయపడే 6 సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
pexels
ఆకుకూరలు- బచ్చలికూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్ వంటి ఆకుకూరల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ అబ్జార్ప్షన్ ను తగ్గిస్తుంది. ఆకస్మక క్రాష్, స్పైక్ లను నివారిస్తుంది.
pexels
బెర్రీస్- బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్పెబెర్రీస్ లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. వీటిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో డయాబెటిస్ సమస్యలను తగ్గించడంలో సాయపడతాయి.
pexels
చిక్కుళ్లు- బీన్స్, కాయధాన్యాలు, చిక్ పీ.. ప్రోటీన్, ఫైబర్ కు అద్భుతమైన మూలాలు. ఇవి చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసేందుకు సాయపడతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను నివారించడానికి సహాయపడతాయి.
pexels
గింజలు, విత్తనాలు - బాదం, వాల్ నట్స్ , చియా గింజలు, అవిసె గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు, ప్రోటీన్లు, ఫైబర్ లతో నిండి ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లైవల్స్ నియంత్రించడంలో సహాయపడతాయి.
pexels
తృణ ధాన్యాలు- వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ లలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో షుగల్ లెవల్స్ ను నియంత్రిస్తాయి.
pexels
పసుపు- పసుపులోని కర్కుమిన్ యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో, మధుమేహం సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సాహాయపడుతుంది.
pexels
ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.