వెన్నునొప్పి నుంచి ఉపశమనానికి 7 మార్గాలు 

pexels

By Bandaru Satyaprasad
May 13, 2024

Hindustan Times
Telugu

వెన్ను నొప్పి తరచూ మీ రోజు వారీ పనులకు అంతరాయం కలిగిస్తుందా? ఆకస్మాత్తుగా ఎక్కువ వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలతో మీకు ఉపశమనం లభిస్తుంది.  

pexels

చురుకుగా ఉండండి - ఉద్యోగ, వ్యాపారరీత్యా ఎక్కువ సేపు కూర్చోవడం ఉంటే...తగిన వ్యాయామాలను చేయడం ముఖ్యం. వ్యాయామం మీ వెన్ను కండరాలలో స్టిఫ్ నెస్ ను తగ్గించి నొప్పిని తగ్గిస్తుంది. 

pexels

సరైన పరుపు ఎంపిక - మీ పరుపు కారణంగా వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంది. తగిన సౌకర్యాన్ని, నిద్ర నాణ్యతను మెరుగుపరిచే పరుపును ఎంచుకోండి.  

pexels

బ్యాడ్ పోస్చర్ ను నివారించండి - వెన్నునొప్పిని నివారించడానికి గుడ్ పోస్చర్ చాలా ముఖ్యం. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు సరైన భంగిమను ఎంచుకోండి. వెన్నెముక సరైన అమరికకు మద్దతు ఇవ్వడానికి ఎర్గోనామిక్ కుర్చీలు, డెస్క్ లను ఉపయోగించండి.  

pexels

సరైన నిద్ర - నిద్ర లేమి సమస్యతో వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. మీకు బాగా నిద్రపట్టడానికి సౌకర్యవంతమైన దిండు, మెట్రెస్ ఉపయోగించండి.  

pexels

హై హీల్స్ మానుకోండి - మీరు ఎక్కువ కాలం హైహీల్స్ ధరించడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల వెన్నునొప్పి వస్తుంది. మీ వెన్నుముక కండరాలపై ఒత్తిడి తగ్గించే సపోర్టివ్ పాదరక్షలను ఎంచుకోండి.  

pexels

బరువు నిర్వహణ - ఊబకాయం, అధిక బరువు వెన్నునొప్పికి దారి తీస్తుంది. సరైన బరువు నిర్వహణ వెన్నునొప్పి తగ్గించడానికి, అసౌకర్యాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.  

pexels

రాత్రివేళ ఈ ఆహారాలు తింటే ఊబకాయం పెరిగే రిస్క్

Photo: Pexels