జింక్ మన శరీరానికి ఒక ముఖ్యమైన మినరల్. రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి, గాయాన్ని నయం చేయడంలో, కణాల పెరుగుదలను ప్రోత్సహించడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది.  

pexels

By Bandaru Satyaprasad
Oct 06, 2024

Hindustan Times
Telugu

వెజిటేరియన్స్ కోసం 6 రకాల జింక్ రిచ్ ఫుడ్స్   

pexels

గింజలు - జీడిపప్పు, బాదం పప్పులు మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వుల వంటి పోషకాలతో పాటు జింక్ ను అందిస్తాయి. 

pexels

విత్తనాలు - గుమ్మడికాయ, నువ్వులు జింక్ కు పవర్ హౌస్. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  

pexels

చిక్కుళ్లు - చిక్ పీస్, కాయధాన్యాలు, బీన్స్ లో ప్రోటీన్లు అధికంగా ఉండటమే కాకుండా జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. జింక్ ను గ్రహించడానికి బెల్ పెప్పర్స్, టమాటా వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు వాటికి జోడించండి.  

pexels

కూరగాయలు -  స్వీట్ పొటాటోలో జింక్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్ ఎ, బి , సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం ఉంటాయి.  

pexels

డెయిరీ ప్రొడెక్ట్స్ - జున్ను, పాలు కాల్షియంతో పాటు జింక్ ను అందిస్తాయి. ఈ పోషకాలు ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడతాయి.  

pexels

తృణ ధాన్యాలు - క్వినోవా, బ్రౌన్ రైస్, వోట్స్ జింక్ పుష్కలంగా కలిగిన ఆహారాలు. వీటిల్లో జింక్ శోషణను నిరోధించే ఫైటేట్ లు ఉంటాయి. జింక్ శోషణను పెంచేందుకు ముందుగా వీటిని నానబెట్టడం మంచిది.  

pexels

దురదగొండి ఆకులో అద్భుత ఔషధ గుణాలు