జామున్ లేదా జావా ప్లమ్ లేదా బ్లాక్ ప్లమ్ రుచి అమోఘంగా ఉంటుంది. ఆరోగ్యానికి కీలకమైన అనేక పోషకాలు నేరేడులో ఉంటాయి. నేరేడు పండు తినడం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
twitter
By Bandaru Satyaprasad Jun 19, 2024
Hindustan Times Telugu
చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది - నేరేడులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మొటిమలు, ముడతలు తగ్గించే ఆస్ట్రింజెంట్ లక్షణాలు ఇందులో ఉన్నాయి.
twitter
బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణ - నేరేడు పండ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి దీనిని తినవచ్చు.
twitter
బరువు తగ్గడానికి - నేరేడులో ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గడానికి ఇది చక్కటి ఆహారం. తక్కువ కేలరీలు, ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల బరువు నిర్వహణకు దోహద పడుతుంది.
twitter
హిమోగ్లోబిన్ కౌంట్ వృద్ధి -నేరేడులోని విటమిన్ సి, ఐరన్ హిమోగ్లోబిన్ కౌంట్ ను పెంచడంలో సహాయపడుతుంది. ఐరన్ రక్తా్న్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
twitter
గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది - జీర్ణ సమస్యల నిర్వహణకు ఫైబర్ చాలా అవసరం. జామున్ లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది పేగు కదలికలను సాఫీగా చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
twitter
గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది - నేరేడు పండ్లలోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియత్రించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది అనేక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
twitter
రోగనిరోధక శక్తిని పెంచుతుంది - నేరేడులోని విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్పెక్షన్లు, అనారోగ్యాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇచ్చి గాయాలు నయం కావడానికి దోహదం చేస్తాయి.
freepik
రాత్రి భోజనం తరువాత యాలకులు నమిలితే వచ్చే మేలు ఎంతో