వేసవిలో చల్లని నీటితో స్నానం చేయాలనే భావన కలుగుతుంది. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాయపడుతుంది. చన్నీటి స్నానంతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుంది.
pixabay
By Bandaru Satyaprasad Apr 01, 2024
Hindustan Times Telugu
బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది- చల్లని నీటితో స్నానం రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. రక్త ప్రసరణ గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. హైపర్ టెన్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
pexels
రోగనిరోధక పనితీరు మెరుగుపరుస్తుంది- ల్యూకోసైట్లు శరీరంలో వ్యాధి సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతుంది. చల్లటి నీటితో స్నానం చేస్తే ల్యూకోసైట్ లు ప్రేరేపితం అవుతాయి. దీంతో జలుపు, ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాల నుంచి రక్షణ కల్పిస్తాయి.
pexels
డిప్రెషన్ నుంచి ఉపశమనం- ఓ అధ్యయనం ప్రకారం వారానికి 2-4 సార్లు 5 నిమిషాల పాటు చన్నీళ్ల స్నానం చేయడం వల్ల డిప్రెషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫీల్ గుడ్ ఎండార్పిన్ హార్మోన్ ను పెంచుతుంది.
pexels
నొప్పులను తగ్గిస్తుంది
pexels
చన్నీళ్ల స్నానంతో కండరాలు రిలాక్స్ అవుతాయి. నొప్పులు, వాపు తగ్గుతాయి. వర్క్ అవుట్ తర్వాత చన్నీళ్ల స్నానం మంచి ఉపశమనం కలిగిస్తుంది.
pexels
చర్మం, జుట్టు రక్షణ
pexels
చల్లటి నీరు చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. తల చర్మం లేదా జుట్టు పొడిగా కాకుండా చేస్తుంది. ఎక్స్ ట్రా ఆయిల్ తగ్గించి చర్మం, జుట్టును రక్షిస్తుంది.
pexels
పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి..! వీటిని తెలుసుకోండి