మనం పండ్లు తినేటప్పుడు తొక్కతీసేసి తింటాం. కానీ కొన్ని పండ్ల తొక్కల్లో అదనపు పోషకాలు ఉంటాయి. ఈ 7 పండ్లను తొక్కతో కలిపి తింటే అదనపు పోషకాలు లభిస్తాయి.
pexels
By Bandaru Satyaprasad Dec 30, 2024
Hindustan Times Telugu
ఆపిల్ - ఆపిల్ పీల్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇందులోక్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయడ్స్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
pexels
జామ పండు - జామ తొక్కల్లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియకు సహాయపడుతుంది. గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
pexels
కివి ఫ్రూట్ - కివి తొక్కలు ఫైబర్, విటమిన్ సి, యాంటీ అక్సిడెంట్లతో నిండి ఉంటాయి. కివి స్కిన్ కాస్త గరుకుగా ఉన్నప్పటికీ గుజ్జు కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. కివి పండును తొక్కతో పాటు తినడం వల్ల రోగనిరోధక శక్తికి, జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
pexels
పీచ్ - పీచ్ స్కిన్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పీచ్ తొక్కల్లోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
pexels
ప్లమ్ పండు - ప్లమ్ స్కిన్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంథోసైనిన్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
pexels
సపోటా - సపోటా స్కిన్ తినదగినది. ఇది జీర్ణక్రియకు తోడ్పడే ఫైబర్, పోషకాలను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తికి మద్దతు ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లకు సపోటా స్కిన్ గొప్ప మూలం.
pexels
పియర్ - పియర్ స్కిన్ ఫైబర్, విటమిన్లతో నిండి ఉంటుంది. దీని ఫ్లష్ కంటే తొక్కల్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పియర్స్ గట్ హెల్త్ కు సహాయపడుతుంది.
pexels
పక్షవాతం వచ్చే ముందు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి?