ఆరోగ్యంగా ఉండేందుకు వెనక్కి నడవమంటున్నారు వైద్య నిపుణులు. వెనక్కి నడవడం వల్ల కలిగి 7 ప్రయోజనాలు తెలుసుకుందాం.  క్రమతప్పకుండా నడక అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. వెనక్కి నడవడంతో ఫిట్ నెస్ స్థాయిలు మెరుగుపడతాయి. 

pexels

By Bandaru Satyaprasad
Jul 03, 2024

Hindustan Times
Telugu

శరీర బ్యాలెన్స్ ను మెరుగుపరుస్తుంది - రివర్స్ లో నడిస్తే మీ శరీర బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. రివర్స్ నడతతో కాళ్లు, కాళ్లలోని కండరాలు బలోపేతం అవుతాయి.  

pexels

కండరాల బలం - రివర్స్ వాకింగ్ శరీరంలోని క్వాడ్రిస్ప్స్, హామ్ స్ట్రింగ్స్  సామర్థ్యాన్ని పెంచుతుంది. శరీర కండరాల బలాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది.  

pexels

మైండ్, బాడీ బ్యాలెన్స్ - వెనక్కి కదలడం మీ మెదడను విభిన్నంగా ప్రేరేపిస్తుంది. మీరు మీ శరీర కదలికపై ఎక్కువ దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. మీ మెదడు, శరీరానికి మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుంది.  

pexels

వెన్ను నొప్పిని తగ్గిస్తుంది - రివర్స్ వాకింగ్ మీ శరీర పోస్చర్ ను సరిచేయడంతో పాటు వెన్నెముక కండరాలను బలోపేతం చేస్తుంది. దీంతో వెన్నునొప్పి తగ్గుతుంది. వీపు దిగువ భాగంపై ఒత్తిడిని తగ్గిస్తుంది.  

pexels

లెగ్ మజిల్స్ - రివర్స్ వాకింగ్ కాళ్లలోని కండరాలను యాక్టివేట్ చేస్తుంది. ఇది మోకాళ్లను స్ట్రెచ్ చేసి కండరాల బిగుతుని తగ్గించి మోకాళ్ల నొప్పిని తగ్గిస్తుంది.  

pexels

ఎక్కువ కేలరీలు బర్న్ - బ్రిస్క్ వాక్ తో పోలిస్తే రివర్స్ వాకింగ్ లో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో ఈ వ్యాయామం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.  

pexels

మోకాలి నొప్పిని పరిమితం చేస్తుంది - ముందుకు నడుస్తున్నప్పుడు మోకాలి భాగంలో ఒత్తిడితో కొన్నిసార్లు మోకాలి సమస్యలు తీవ్రతరం అవుతాయి. వెనక్కి నడిస్తే ఒత్తిడి తగ్గి మోకాలి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ వెనక్కి నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  

pexels

కాలేయానికి మేలు చేసే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels