మీ ఆహారపు అలవాట్లు మీ మొత్తం ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునేందుకు సరైన ఆహారపు అలవాట్లు పాటించాలి.   డయాబెటిస్ ఉన్న వారు సరైన మోతాదులో పోషకాలను పొందడం చాలా ముఖ్యం.   

pexels

By Bandaru Satyaprasad
Jun 18, 2024

Hindustan Times
Telugu

మధుమేహ నియంత్రణకు అవసరమైన 6 పోషకాలు 

pexels

 ఫైబర్ - ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో షుగర్ శోషణను నెమ్మదిస్తుంది.  పండ్లు, బీన్స్, వోట్స్‌లోని ఫైబర్ రక్తంలో షుగర్ శోషణ రేటును తగ్గిస్తుంది. తృణధాన్యాలు, గింజలలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.  

pexels

మెగ్నీషియం- మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో మెగ్నీషియం లెవల్స్ తక్కువగా ఉంటాయి. ఆకు పచ్చని కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు మెగ్నీషియంతో నిండి ఉంటాయి.  

pexels

విటమిన్ డి - విటమిన్ డి గ్లూకోజ్ జీవక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి తక్కువ ఉంటే  టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే తగిన సూర్యరశ్మి, బలవర్థకమైన ఆహారం, చేపలు, గుడ్లు తీసుకోవడం ద్వారా విటమిన్ డి తగినంతగా అందుతుంది.  

pexels

క్రోమియం - క్రోమియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే ట్రేస్ మినరల్, గ్లూకోజ్ జీవక్రియను నిర్వహిస్తుంది. గ్రీన్ బీన్స్, బ్రోకలీ, బార్లీ, వోట్స్, బాదంలో క్రోమియం పుష్కలంగా ఉంటుంది.   

pexels

జింక్ - రక్తంలో చక్కెరను నియంత్రించడంలో జింక్ కీలకమైన విటమిన్. జింక్ ఇన్సులిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. జింక్ అధికంగా ఉండే ఆహారాలలో మాంసం, షెల్ ఫిష్, చిక్కుళ్లు, విత్తనాలు, గింజలు ఉన్నాయి. 

pexels

పొటాషియం - పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పొటాషియం లెవల్స్ తక్కువగా ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అరటిపండ్లు, నారింజ, బంగాళదుంపలు, టమోటాలు, బచ్చలికూర వంటి పొటాషియం ఆహారాలను తప్పనిసరిగా తినాలి. 

pexels

కాలేయానికి మేలు చేసే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels