అతిగా నిద్రపోవడం, రాత్రుళ్లు 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అతి నిద్ర వల్ల కలిగే  ఆరోగ్య సమస్యలు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Jan 05, 2025

Hindustan Times
Telugu

మధుమేహం వచ్చే ప్రమాదం - అతిగా నిద్రపోవడం వల్ల శరీరం సహజ సిర్కాడియన్ రిథమ్ లో ఆటంకాలు ఏర్పడటం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది.  

pexels

ఊబకాయానికి కారణం కావచ్చు- ఎక్కువ సమయం నిద్రపోతే బరువు పెరగడానికి ముడిపడి ఉంటుంది. ఆకలి, సంతృప్తి హార్మోన్ల నియంత్రణకు అంతరాయం కలిగించవచ్చు. దీంతో అతిగా తినడాన్ని ప్రోత్సహిస్తుంది.  

pexels

డార్క్ సర్కిల్స్ -అధికంగా నిద్రపోవడం వల్ల మీ ముఖం చుట్టూ, కళ్ల కింద ద్రవం పేరుకుపోతుంది. దీని వలన మీ కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తాయి. నల్లటి వలయాలు ఏర్పడతాయి. 

pexels

పాలిపోయిన చర్మం- అతిగా నిద్రపోవడం వల్ల మీ చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది.   

pexels

నొప్పి, అసౌకర్యం - ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల వెన్నునొప్పి, మెడ బిగుసుకుపోవడం, తలనొప్పి వంటి శారీరక అసౌకర్యానికి దారితీయవచ్చు. అతిగా నిద్రపోవడం వల్ల కండరాలు, కీళ్లపై అధిక ఒత్తిడి ఉంటుంది. ఇది నొప్పులకు దారితీరిస్తుంది.  

pexels

 గుండె సమస్యలు -అతిగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. ఇది రక్తపోటు నియంత్రణను ప్రభావితం చేయడం, వాపును పెంచడవ ద్వారా హృదయనాళ వ్యవస్థపై అనవసరమైన ఒత్తిడిని కలిగించవచ్చు. 

pexels

 డిప్రెషన్ సంకేతాలు - అధిక నిద్ర డిప్రెషన్ కు దారితీయవచ్చు. అతిగా నిద్రపోవడం మానసిక రుగ్మతలను మరింత తీవ్రతరం చేస్తుంది. వ్యక్తులు మరింత బద్దకంగా, తక్కువ ప్రేరణతో ఉంటారు.  

pexels

మొగుడు-పెళ్లాం మధ్య ఏ లొల్లీ రాకుండా కొద్దికాలం పాటు ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. 

pexel