దొండకాయ తింటే... ఇన్ని ప్రయోజనాలా..!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 29, 2024

Hindustan Times
Telugu

దొండకాయలో  ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి  సమస్యలను దూరం చేస్తుంది.

image credit to unsplash

దొండకాయలో విటమిన్‌ – బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి , క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

image credit to unsplash

దొండకాయలోని యాంటీ-అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. 

image credit to unsplash

దొండకాయలో థయమిన్‌ ఉంటుంది. వీటిని తినటం వల్ల రక్తహీనత సమస్య క్రమంగా తగ్గుతుంది.

image credit to unsplash

పచ్చి దొండకాయ మీ రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. కోవాక్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. 

image credit to unsplash

దొండకాయ తీసుకోవడం ద్వారా అనేక రకాల వైరల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు

image credit to unsplash

దొండకాయలో గుండెను ఆరోగ్యంగా ఉంచే వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్‌లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

image credit to unsplash

ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి విషయాలు ఒత్తిళ్లకు కారణం అవుతాయి. అయితే ఒత్తిడి తగ్గించుకునేందుకు 7 సూపర్ ఫుడ్స్ ను ప్రయత్నించండి. ఈ ఆహారాలు కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి.  

pexels