ఉదయమే అల్లం రసం, తేనె మిశ్రమం తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
PINTEREST, DABUR HONEY
By Sudarshan V Jun 21, 2025
Hindustan Times Telugu
అల్లం రసం, తేనె మిశ్రమాన్ని రోజు ఉదయమే తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
PINTEREST
అల్లం మరియు తేనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి
PINTEREST
గొంతులోని శ్లేష్మాన్ని ఈ మిశ్రమం తొలగిస్తుంది. అల్లం రోగ నిరోధక లక్షణాలతో కలిసి ఈ మిశ్రమం దగ్గు మరియు జలుబుకు సమర్థవంతమైన సహజ నివారిణిగా పనిచేస్తుంది.
PEXELS
అల్లం మరియు తేనె కలిసి సహజ నొప్పి నివారిణిగా పని చేస్తాయి. ఈ మిశ్రమం ఆకలిని పెంచుతుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
PINTEREST
అల్లం తేనె మిశ్రమం కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
PIXABAY
తేనె మరియు అల్లం మిశ్రమం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గట్ హెల్త్ కు సహాయ పడుతుంది. అల్లం లోని సహజ జీర్ణ లక్షణాలు ఇందుకు దోహదపడుతాయి.
PIXABAY
వికారం, వాంతి తదితర లక్షణాలను ఈ మిశ్రమం తగ్గిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో వేడినీటిలో అల్లం, తేనె కలిపి తీసుకుంటే మార్నింగ్ సిక్ నెస్ తగ్గుతుంది.