జీవితంలో కొన్ని ప్రతికూల అలవాట్లను, మనస్తత్వాలను వదిలివేస్తే మీ జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మీరు వదిలివేయాల్సిన 7 విషయాల గురించి తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Jun 12, 2024

Hindustan Times
Telugu

గిల్టీ - మీ తప్పులను గుర్తించి, వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగడం ముఖ్యం. అపరాధ భావాన్ని విడిచిపెట్టి మీ అనుభవాల నుంచి ఎదగడానికి ప్రయత్నించండి.  

pexels

పోలిక - మీరు నిరంతం ఇతరులతో పోల్చుకోవడం అసమర్థత, అసంతృప్తికి దారి తీస్తుంది. ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రత్యేకమైనంది. మీ సొంత మార్గంలో నడుస్తూ పురోగతిపై దృష్టి కేంద్రీకరించండి.  

pexels

గత సంఘటనలు - గత సంఘటనల గురించి ఆలోచించడం మానుకోండి. అవి ప్రస్తుత జీవనానికి అవరోధాలుగా మారతాయి.  గతాన్ని అంగీకరించి, దాని నుంచి నేర్చుకుని, భవిష్యత్తు మార్గాన్ని నిర్దేశించుకోండి.  

pexels

జీవితంలో కొన్ని ప్రతికూల అలవాట్లను, మనస్తత్వాలను వదిలివేస్తే మీ జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మీరు వదిలివేయాల్సిన 7 విషయాల గురించి తెలుసుకుందాం.  

pexels

జీవితంలో కొన్ని ప్రతికూల అలవాట్లను, మనస్తత్వాలను వదిలివేస్తే మీ జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మీరు వదిలివేయాల్సిన 7 విషయాల గురించి తెలుసుకుందాం.  

pexels

ఓటమి భయం - మీ ప్రయత్నాల్లో విఫలమవుతారనే భయం మిమల్ని రిస్క్ తీసుకోకుండా, అవకాశాలను కొనసాగించకుండా చేస్తుంది. మీ వైఫల్యాల నుంచి నేర్చుకోండి, భయపడకుండా ముందడుగు వెయ్యండి. విజయానికి వైఫల్యాలు తొలి మెట్టు అని మర్చిపోకండి.  

pexels

ప్రతికూల స్వీయ చర్చ - మీతో మీరు మాట్లాడుకోండి. మీ ప్రతికూల అంశాలపై మీకు మీరు చెప్పుకోండి. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ గౌరవానికి, వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగించే వాటికి దూరంగా ఉండండి.  

pexels

మిస్టర్ పర్ఫెక్ట్  - మీరు ప్రతిసారి పర్ఫెక్ట్ గా ఉండవలసిన అవసరం లేదు. మీ పురోగతి కోసం మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీతో మీరు నిజాయితీగా ఉండండి. ఎదుటివారి ముందు నటించాల్సిన అవసరం లేదు.  

pexels

ఇతరులపై ఫిర్యాదులు - ప్రతి చిన్న విషయానికి ఫిర్యాదుల చేసే వారైతే ఇప్పుడే వాటిని ఆపేయండి. సానుకూల అంశాల కంటే ప్రతికూల విషయాలపై ప్రాముఖ్యత ఇస్తే మీ మానసిక పరిస్థితి మరింత దిగజారుతుంది. సంతోషంగా ఉండలేదు.   

pexels

ఈ వానాకాలంలో అల్లంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

image credit to unsplash