పొట్ట ఆరోగ్యాన్ని ఈ 9 అలవాట్లు దెబ్బ తీస్తాయని గుర్తుంచుకోండి

Image Credits : Adobe Stock

By Hari Prasad S
Jun 10, 2025

Hindustan Times
Telugu

పొట్టకు ఎలాంటి విశ్రాంతి ఇవ్వకుండా రోజంతా తింటూ ఉండటం సరికాదు. దీనివల్ల జీర్ణ క్రియకు తగినంత సమయం దొరకదు. దీంతో అజీర్తిలాంటి సమస్యలు వస్తాయి

Image Credits : Adobe Stock

మరీ ఎక్కువగా కెఫీన్ తీసుకోవడం. ముఖ్యంగా కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల పొట్టలో యాసిడ్ ఉత్పత్తి పెరిగి అజీర్తి, అసౌకర్యం, గుండెల్లో మంట వంటి వాటికి కారణమవుతుంది.

Image Credits : Adobe Stock

రోజూ తగినంత నీళ్లు తాగకపోవడం వల్ల కూడా పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగడం మంచిది. అలా చేయకపోతే మలబద్ధకంలాంటి సమస్యలు వస్తాయి.

Image Credits : Adobe Stock

చూయింగ్ గమ్ నమలడం వల్ల కూడా పొట్టకు నష్టమే. దీనివల్ల గాలి ఎక్కువగా లోనికి వెళ్లి గ్యాస్, కడుపు ఉబ్బరంలాంటి సమస్యలు వస్తాయి.

Image Credits : Adobe Stock

ప్రొబయోటిక్స్ వల్ల పొట్ట ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఎక్కువగా లభించే పెరుగులాంటి ఆహారాలను తీసుకోకపోవడం వల్ల చెడు బ్యాక్టీరియా పొట్టలో పెరిగిపోతుంది.

Image Credits : Adobe Stock

వేగంగా తినడం మంచిది కాదు. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, అసౌకర్యంలాంటి సమస్యలు వస్తాయి.

Image Credits : Adobe Stock

మలమూత్రాలను ఎక్కువసేపు ఆపుకోవడం కూడా దీర్ఘకాలంలో మీ పొట్ట, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.

Image Credits : Adobe Stock

పొట్ట ఆరోగ్యానికి విటమిన్ డి అవసరం. ఇది సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. సరైనంత ఎండ శరీరంపై పడకపోతే విటమిన్ డి శరీరానికి అందదు.

Image Credits : Adobe Stock

స్మోకింగ్ వల్ల శరీరంలోని చాలా అవయవాలతోపాటు పొట్ట ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. స్మోకింగ్ పొట్టలో యాసిడ్ రీఫ్లక్స్, అల్సర్లలాంటి వాటికి కారణమవుతుంది.

Image Credits : Adobe Stock

పసుపు వాటర్ ఎందుకు తాగాలి...? ఈ కారణాలు తెలుసుకోండి

image credit to unsplash