గుండె నిండా గుడి గంటలు సీరియల్ శ్రుతి నటించిన సినిమాలు ఏవంటే?
By Sanjiv Kumar Jan 31, 2025
Hindustan Times Telugu
గుండె నిడా గుడి గంటలు సీరియల్‌లో బాలు తమ్ముడు రవి ప్రేయసి, భార్యగా శ్రుతి పాత్రలో అలరిస్తోంది విహారిక చౌదరి.
అయితే, స్టార్ మా ఛానెల్‌లోని గుండె నిండా గుడి గంటలు సీరియల్ కంటే ముందుగా చాలా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, సినిమాల్లో నటించింది విహారిక చౌదరి.
గతేడాది 2024లో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో విహారిక చౌదరి నటించిన సినిమా వారధి. భర్త, ప్రియుడి మధ్య నలిగే పాత్రలో విహారిక నటించింది.
వారధి కంటే ముందుగా 2024 సంవత్సరంలోనే కాలం రాసిన కథలు అనే సినిమా చేసింది శ్రుతి అలియాస్ విహారిక చౌదరి.
అలాగే, అదే ఏడాది వి లవ్ బ్యాడ్ బాయ్స్ అనే తెలుగు బోల్డ్ కామెడీ చిత్రంలో కూడా అలరించింది విహారిక చౌదరి. ఇందులో ముగ్గురు హీరోయిన్స్‌లో విహారిక ఒకరిగా చేసింది.
వారధి, కాలం రాసిన కథలు, వి లవ్ బ్యాడ్ బాయ్స్ కంటే ముందుగా 2021లో ఫంకీ ఫ్లాట్‌మేట్స్ అనే కామెడీ యూట్యూబ్ సిరీస్‌లో నటించింది విహారిక చౌదరి.
ఇవే కాకుండా విహారిక చౌదరి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, నేను నా రాక్షసి, బుల్లబ్బాయి ఫ్రమ్ బుర్రలంక వంటి యూట్యూబ్ షార్ట్ వెబ్ సిరీస్‌లు చేసింది.
ఇంకా గుండె నిండా గుడి గంటలు సీరియల్ శ్రుతి అయిన విహారిక చౌదరి ఆ-డిషన్, ఎవరెవరో, లవ్ జర్నీ వంటి షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది.
జుట్టు తెల్లబడటాన్ని, బట్టతల రావడాన్ని కరివేపాకు సమర్ధవంతంగా నిరోధిస్తుంది. జుట్టు సంరక్షణకు ఇది అత్యుత్తమ వంటింటి ఔషధం.