సాధారణ ఆరోగ్య సమస్యలలో దగ్గు ఒకటి. విపరీతమైన దగ్గు వస్తే జామ ఆకులు తినమని వైద్య నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులు కొంత ఉపశమనం కలిగిస్తాయని అంటున్నారు. జామ ఆకు ప్రయోజనాలు తెలుసుకుందాం. 

pexels

By Bandaru Satyaprasad
Jun 09, 2024

Hindustan Times
Telugu

దగ్గు అనేది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే పరిస్థితి. దగ్గుకు అలెర్జీలు, అంటువ్యాధులు లేదా పర్యావరణ కాలుష్య కారకాలు వంటి అనేక కారణాలు ఉన్నాయి.  

pexels

జామ ఆకు సారం శతాబ్దాలుగా దగ్గు నివారణకు ఇంటి చిట్కాగా ఉపయోగపడుతుంది. జామపండులో కూడా విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ దగ్గు లక్షణాలను నయం చేయగలవని వైద్యులు అంటున్నారు.   

pexels

జామ ఆకులలో వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. వీటిలోని ఫినోలిక్ సమ్మేళనాలు, మైకోలిక్ గుణాలు పల్మనరీ ట్రాక్ట్‌ల నుంచి శ్లేష్మాన్ని తొలగించి దగ్గు ప్రమాదాన్ని తగ్గించడంతో సహాయపడతాయి.  

pexels

జామ ఆకు దగ్గు నివారణిగా మాత్రమే కాదు ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మీ ఆహారంలో జామ ఆకులను ఎలా చేర్చుకోవాలో తెలుసుకుందాం.   

pexels

జామ ఆకు టీ - కొన్ని జామ ఆకులను తీసుకుని, అవి మరిగే వరకు కొన్ని నిమిషాలు వేడి నీటిలో ఉంచండి. వడకట్టి, కొంచెం తేనె లేదా నిమ్మరం కలిపి తాగండి. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

pexels

జామ ఆకులను ఉడికించడం-మీకు జామ ఆకు టీకి నచ్చకపోతే, ఆకులను మీ ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కూరలు, సూప్‌లు లేదా స్టైర్-ఫ్రైస్‌లకు జోడించవచ్చు. 

pexels

నేరుగా తినండి -జామ ఆకులను మీరు నేరుగా తినవచ్చు. జామ ఆకులను శుభ్రం చేసి, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నమలండి. 

pexels

దగ్గు నివారణకు జామ ఆకులను ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఉత్తమ సమయం అని వైద్యులు అంటున్నారు. జామ ఆకుల్లో బయోయాక్టివ్ సమ్మేళనాలు సులభంగా శోషించి దగ్గును నివారించడంతో సాయపడతాయి.  

pexels

జామ ఆకులు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ  గర్భిణీ, పాలిచ్చే తల్లులకు వైద్యులను సంప్రదించాలి. కొందరికి జామ ఆకులు, పండ్ల వల్ల అలర్జీ రావచ్చు. వారు వైద్యుడ్ని సంప్రదించాలి.   

pexels

సొరకాయ జ్యూస్ తో బరువు తగ్గింపు..! ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash