గుడ్ టచ్, బ్యాడ్ టచ్: బ్యాడ్ టచ్ గురించి మీ పిల్లలకు ఇలా అవగాహన కల్పించండి.

By Sudarshan V
Mar 08, 2025

Hindustan Times
Telugu

నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సమాజంలో మహిళల హక్కులపై, అధికారాలపై, లింగ సమానత్వంపై అవగాహన పెంచుకోవాల్సిన రోజు ఇది.

సమాజం ఎంత మారినా, కూతుళ్లు ఎంత ఎదిగినా ఆడపిల్లల జీవితం చాలా సున్నితమైనదనే విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోకూడదు. 

మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. 

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించడానికి ఈ చిట్కాలను పాటించండి 

శరీరంలోని ప్రతి అవయవం, వాటి పనితీరు గురించి పిల్లలకు బోధించండి. 

శరీరంలోని ప్రైవేట్ భాగాల గురించి వివరంగా తెలియజేయండి. వాటిని ఇతరులెవరూ టచ్ చేయకూడదని చెప్పండి.

ఎవరైనా సరే, ఎక్కడ, ఏ రకంగా టచ్ చేస్తే తప్పో వారికి అర్థమయ్యేలా వివరించండి.

చిన్నతనం నుంచే దీని గురించి మీ పిల్లలతో మాట్లాడండి. దీని గురంచి మాట్లాడడం తప్పు అనే భావన వారిలో పెంచకండి.

అది స్కూలు అయినా, ఇల్లు అయినా, బయటి వాతావరణం అయినా, పిల్లలు తాము ఎదుర్కొన్న సమస్య గురించి ధైర్యంగా మాట్లాడాలని నేర్పించండి.

ఇతరులు తప్పుగా ప్రవర్తించినప్పుడు భయపడకుండా ఎలా స ్పందించాలో వారికి వివరించండి.

కుటుంబ సభ్యులతో సహా బ్యాడ్ టచ్ ఎవరు చేసినా సహించవద్దని, ప్రతిఘటించాలని, వెంటనే తల్లికి లేదా ఇతర కుటుంబ సభ్యులకు చెప్పాలని వివరించండి.

రాత్రి పడుకునే పది నిమిషాల ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

Unsplash