ఈ 7 లక్షణాలున్న అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం.. ఈజీగా ప్రేమలో పడతారు!
By Ramya Sri Marka Mar 23, 2025
Hindustan Times Telugu
తాజా అధ్యయనాల ప్రకారం చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల్లో కొన్ని లక్షణాలను బాగా ఇష్టపడతున్నారట. వాటిని చూసి ఈజీగా ప్రేమలో పడుతున్నారట. అబ్బాయిల్లో అమ్మాయిలకు బాగా నచ్చుతున్న వాటిలో ముఖ్యమైన 7 లక్షణాల గురించి తెలుసుకుందాం.
మహిళలు ఎత్తు పొడవనున్న పురుషులను, విశాలమైన ముఖం కలిగిన పురుషులను బాగా ఇష్టపడుతున్నారట. ఇలాంటి వారు జీవిత భాగస్వాములు కావాలని ఆశపడుతున్నారట.
Pixabay
గంభీరమైన స్వరం అంటే బేస్ వాయిస్ ఉన్న అబ్బాయిలను కూడా గర్ల్స్ బాగా ఇష్టపడతారట. వారి స్వరం వింటూ మైమరిచిపోతారట.
కాన్పిడెంట్ గా కనిపించే అబ్బాయిను చూస్తే అమ్మాయిలు ఈజీగా పడిపోతారట.ఎందుకంటే తమ జీవిత భాగస్వామిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలని కోరుకుంటారట.
చూడటానికి రఫ్‌గా కనిపించినప్పటికీ సెన్సిటివ్‌గా, చలాకీగా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. అలాంటి వారితో త్వరగా ప్రేమలో పడతారట.
కార్లు, బైకులను స్టైలుగా, సేఫ్‌గా నడిపే బాయ్స్ అంటే గర్ల్స్ కి బాగా క్రేజ్ అంట. ఇలాంటి వాడు లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అనుకుంటారట.
ఒకప్పుడు గడ్డం పెంచుకుంటే లవ్ ఫెయిల్యూర్ అనేవాళ్లు. ఇప్పుడ గడ్డం పెంచుకోవడం ట్రెండ్ అయింది. ఎందుకంటే ఇలా గడ్డంతో కనిపించే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారట.
పొగడ్తలకు పడిపోని అబ్బాయిలు, ఆర్థికంగా సురక్షితంగా ఉండే పురుషులు అంటే అమ్మాయిలకు చాలా అభిమానం. ఇలాంటి వారితో సులువుగా ప్రేమలో పడుతున్నారట.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను, రకరకాల అధ్యయనాలను క్రోడీకరించి మాత్రమే ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.
Pixabay
సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి