ఇంట్లో గోడలపై బల్లులు తిరుగుతుంటాయి. లైట్ల వద్ద చిన్న చిన్న పురుగులను తింటూ ఇంట్లోని చీకటి ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. బల్లులు వంట పాత్రలపై పడడం, పాకడం చేస్తుంటాయి. దీంతో బల్లులను ఇంట్లో నుంచి తరమడానికి ప్రయత్నిస్తుంటారు.
Twitter
By Bandaru Satyaprasad Aug 12, 2024
Hindustan Times Telugu
మీ ఇంట్లో బల్లుల సమస్య అధికంగా ఉందా? అయితే ఈ వంటింటి చిట్కాలు పాటించండి.
Twitter
బల్లులను తరిమే రసాయన స్ప్రేలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ సహాజ పద్ధతుల్లో బల్లులను తరిమే చిట్కాలు తెలుసుకుందాం.
Twitter
వెల్లుల్లి, ఉల్లిపాయ, మిరియాలు మిక్సీలో వేసి.. రెండు గ్లాసుల నీళ్లు వేసి మెత్తగా ఆడుకోవాలి. దీనిని వడకట్టి ఆ నీటిని ఓ స్ప్రే బాటిల్ లో వేసుకోండి. దీన్ని బల్లులపై స్ప్రే చేయడం లేదా బల్లులు తిరిగే చోట స్ప్రే చేస్తే ఆ వాసనకు బల్లులు ఇంట్లోంచి వెళ్లిపోతాయి.
pexels
ఒక గిన్నెలో నీటిని వేడి చేసుకుని, అందులో ముద్ద హారతి కర్పూరం పొడి వేసుకోవాలి. కర్పూరం నీటిలో కరిగాక, ఆ నీటిని స్ప్రే బాటిల్ లో వేసుకొని ఇంట్లో స్ప్రే చేసుకోవాలి. ఇలా రోజు స్ప్రే చేస్తే బల్లులు సమస్య తగ్గుతుంది.
ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకుని, అందులో అర స్ఫూన్ డెటాల్, అర స్పూన్ లైజాల్ కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి కాస్త నీళ్లు జోడించి స్ప్రే బాటిల్ లో వేయాలి. దీన్ని బల్లులు తిరిగే చోట స్ప్రే చేస్తూ ఉంటే అవి ఇంట్లోంచి బయటికి వెళ్లే అవకాశం ఉంది.
pexels
ఇంట్లోని గోడలకు బూజు పట్టడం, గాలి, వెలుతురు లేకపోవడం వల్లే ఇంట్లో బల్లులు సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో బూజు లేకుండా గాలి, వెలుతురు బాగా వచ్చేలా కిటికీలు తీసి పెట్టడం చేయాలి.
twitter
నాఫ్తలీన్ బాల్స్ - ఇంట్లో నుంచి బల్లులను తరిమికొట్టడానికి నాఫ్తలీన్ బాల్స్‌ను ఉపయోగించవచ్చు. ఇంట్లో అక్కడక్కడా నాఫ్తలిన్ బాల్స్ ఉంచండి. ఇది బల్లులను త్వరగా వదిలించుకోవడానికి చక్కటి పరిష్కారం.
pexels
బిగ్‌బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నది సోనియా ఆకుల.