సీజనల్ పండ్లను ఎక్కువగా తినండి. వీటిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
Unsplash
By Anand Sai Jun 17, 2025
Hindustan Times Telugu
నేరేడు పండ్లు విటమిన్లతో సమృద్ధిగా ఉంటాయి. మన ఊహకు అందని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Unsplash
నేరేడు పండులో విటమిన్ సి, బి12, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఖనిజాలు, ఫైబర్ మంచి మూలం.
Unsplash
నేరేడు పండు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.
Unsplash
నేరేడు పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండ్లలో ఆంథోసైనిన్లు ఉంటాయని, ఇవి మన కణాలకు చాలా మంచివని నిపుణులు అంటున్నారు.
Unsplash
ఈ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అందువల్ల ఇది రక్తహీనతకు బెటర్.
Unsplash
నేరేడు పండులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీనిని తిన్న తర్వాత మీరు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అతిగా తినే అలవాటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
Unsplash
ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
Unsplash
పెరుగుతో చియా విత్తనాలను కలిపి చేసే ఈ రుచికరమైన రెసిపీలను చూడండి..