ప్రకృతిలో అత్యంత సహజ సిద్ధమైన యాంటి బయాటిక్ గురించి ఈ విషయాలు తెలుసా...
By Sarath Chandra.B May 23, 2025
Hindustan Times Telugu
వెల్లుల్లికి ప్రాచీన కాలం నుంచి అన్ని దేశాల చికిత్సలు, వైద్య విధానాల్లో, ఆధునిక ప్రపంచపు వైద్యంలో కూడా ఘనమైన స్థానం ఉంది.
వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయనే విషయంలో అన్ని దేశాల వైద్య విధానాల్లో ఏకాభిప్రాయం ఉంది.
వెల్లుల్లి మధ్యధరా సముద్ర ప్రాంతంలో పుట్టినట్టు భావిస్తారు. వీటి అవశేషాలు ఈజిప్షియన్ పిరమిడ్లలో సైతం కనుగొన్నారు.
క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితమే వైద్యంలో వెల్లుల్లిని వాడినట్టు సుమేరియాలో దొరికిన మట్టి బిళ్లలపై గుర్తించారు.
ఈజిప్షియన్ల కాలంలో వెల్లుల్లిని అధికంగా వినియోగించే వారు. ఈ కారణంగానే గ్రీకు రచనల్లో ఈజిప్షియన్లను కంపు మనుషులుగా వర్ణించే వారు.
భారతీయ వేదాలలో వెల్లుల్లి ప్రస్తావన పెదద్గా కనిపించదు. మూలికల ప్రస్థానం ఉండే వేదాలలో దీని ప్రస్తావన లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి భారత్‌లోకి ప్రవేశించి ఉంటుందనే అంచనా ఉంది.
చరక సంహితలో చర్మ రోగాలకు, వాతాలకు, అంటు వ్యాధులకు, లైంగిక సామర్ధ్యాన్ని పెంచే గుణం వెల్లుల్లిలో ఉన్నట్టు పేర్కొన్నారు.
చంద్ర గుప్త మౌర్యుడి కాలంలో గ్రీకు దేశంతో ఏర్పడిన వ్యాపార సంబంధాలతో దేశంలోకి వెల్లుల్లి ప్రవేశించి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో రచించిన సుశ్రుత సంహితలో వెల్లుల్లి అజీర్తికి, హృదయ సంబంధిత వ్యాధులకు, జీర్ణ వాహిక వ్యాధులకు, మలబద్దకానికి ఔషధంగా సిఫార్సు చేశారు.
క్రీస్తు శకం ఏడో శతాబ్దంలో రచించిన వాగ్భట సంహిత అష్టాంగ హృదయం గ్రంథంలో వెల్లుల్లి ఆకలిని పెంచుతున్నట్టు, విరిగిన ఎముకల్ని అతికిస్తుందని, రక్తాన్ని శుభ్రం చేస్తుందని, జలుబును నయం చేస్తుందని, దేహంలో వ్యాధి నిరోధకత పెంచుతుందని పేర్కొన్నారు.
సారంగధర సంహిత, ధన్వంతరి నిఘంటువు, బసవరాజీయం వంటి గ్రంథాలల్ో కూడా వెల్లుల్లి చికిత్స విధానాల ప్రస్తావన ఉంటుంంది.
భారతీయ వైద్య విధానాల్లో వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశిక గ్రంథాల్లో వెల్లుల్లి ఔషధ గుణాలను ప్రస్తావించారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్, ఫ్రెంచ్, రష్యన్ సైనికులు వెల్లుల్లితో గాయాలను మాన్పడం, ఎమోబిక్ డిసెంట్రీ నయం చేయడం కోసం వినియోగించే వారు.
రెండో ప్రపంచ యుద్ధం నాటికి పెన్సిలిన్ ఆవిష్కరణతో గాయాలను మాన్పడంలో వెల్లుల్లి వినియోగం తగ్గిపోయింది.
తలనొప్పి, క్రిమికీటకాల కాట్లు, నెలసరి నొప్పులు, పేగులలో పురుగులు, గడ్డలు, కణుతులు, హృదయ సంబంధిత వ్యాధులకు వెల్లుల్లి ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది.
వెల్లుల్లి ధమనులు పూడుకుపోవడం, గట్టి పడటం వంటి వ్యాధులను నిరోధించడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించగలదు.
ట్రెండీ లుక్‌లో అనసూయ హాట్ అందాలు.. ఈ రాత్రి కోసమంటూ పోస్ట్