వెల్లుల్లి అనేక ఔషధ గుణాలు కలిగిన పదార్థం. ఈ వెల్లుల్లిని వాసన, రుచి కోసం రోజువారీ ఆహారంలో చేర్చుతాం.
Unsplash
By Anand Sai Jan 05, 2025
Hindustan Times Telugu
ఈ వెల్లుల్లి నుండి పూర్తి పోషకాలను పొందడానికి ఉత్తమ మార్గం పచ్చిగా తినడం. రోజూ ఖాళీ కడుపుతో తినాలి.
Unsplash
రోజూ ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇందులోని అల్లిసిన్ శరీరంలోకి ప్రవేశించే వ్యాధికారక క్రిములతో పోరాడుతుంది.
Unsplash
వెల్లుల్లి రక్తపోటు స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తినండి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.
Unsplash
రోజూ వెల్లుల్లి రెబ్బను తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
Unsplash
వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా గొప్పగా సహాయపడుతుంది.
Unsplash
వెల్లుల్లిలోని శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
Unsplash
వెల్లుల్లి తినాలనుకునే వారు ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బను బాగా నమిలి, తర్వాత ఒక గ్లాసు వేడినీళ్లు తాగాలి.
Unsplash
పిల్లలకు చికెన్, మటన్ లివర్ తినిపిస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి