సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి
By Sanjiv Kumar Apr 21, 2025
Hindustan Times Telugu
పుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ తాను సంతకం చేసిన జెర్సీని మలయాాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు మోహన్ లాల్.
ఈ వీడియోలో "కొన్ని క్షణాలను వర్ణించడానికి మాటలు సరిపోవు" అని మోహన్ లాల్ అన్నారు.
"అలాంటి జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి" అని మోహన్ లాల్ పేర్కొన్నారు.
"నేను నెమ్మదిగా ఈ గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసినప్పుడు నా గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే అది లెజెండ్ మెస్సీ సంతకం చేసిన జెర్సీ" అని మోహన్ లాల్ అన్నారు.
"మెస్సీ తన చేతితో నా పేరు రాయడం. ఆటోగ్రాఫ్ పెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది" అని మోహన్ లాల్ సంతోషం వ్యక్తం చేశారు.
"ఈ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే ఈ అద్భుతమైన క్షణం సాధ్యమయ్యేది కాదు. డాక్టర్ రాజేష్ మంగోటిల్, రాజేష్ ఫిలిప్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు" అని మోహన్ లాల్ తెలిపారు
"అన్నింటికీ మించి నాకు ఈ మరపురాని బహుమతి ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు" అని మోహన్ లాల్ ట్వీట్ చేశారు.
30ఏళ్ల వయసులో కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? ఈ వయసులో వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పులు ఏమిటి?