జుట్టు ఆరోగ్యంతోపాటు మెరుగైన రోగ నిరోధక వ్యవస్థకు జింక్ అవసరం. మరి ఈ జింక్ లభించే ఆహారాలు ఏవో చూడండి

pexels

By Hari Prasad S
May 14, 2024

Hindustan Times
Telugu

గుడ్లలో ప్రొటీన్, బయోటిన్‌తోపాటు జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఒక పెద్ద గుడ్డులో రోజువారీలో తీసుకునే 5 శాతం జింక్ ఉంటుంది

pexels

70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్‌ రోజూ 30 గ్రాములు తీసుకుంటే జింక్ పుష్కలంగా లభిస్తుంది

pexels

పాలకూరలోనూ విటమిన్స్, మినరల్స్ తోపాటు కొంత మోతాదులో శరీరానికి అవసరమైన జింక్ కూడా ఉంటుంది

pexels

ఆయిస్టర్స్ (గుల్లలు) ఈ జింక్ పుష్కలంగా లభించే అత్యుత్తమ ఆహారంగా చెప్పొచ్చు

pexels

గుమ్మడి గింజల్లో జింక్ తోపాటు ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి

pexels

వివిధ రకాల పప్పుల్లోనూ జింక్ పుష్కలంగా ఉంటుంది. రోజువారీ కావాల్సిన జింకులో 30 శాతం ఒక కప్పు పప్పులో లభిస్తుంది

pexels

బాదాం, కాజు, పల్లీలులాంటి నట్స్‌లోనూ పుష్కలంగా జింక్ లభిస్తుంది

pexels

ఈ లడ్డూలతో స్వీట్స్ తింటూనే బరువు తగ్గవచ్చు..

Pixabay